Saturday, May 18, 2024
- Advertisement -

దేశ రాజ‌ధాని ఢిల్లీలో 80 శాతం ట్యాప్ వాట‌ర్ క‌లుషిత‌మే…

- Advertisement -

ప్ర‌పంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ వ్య‌ర్థాలు పెరిగిపోవ‌డంతో ప్ర‌కృతి స‌మ‌తుల్యం దెబ్బ‌తింటోంది. పంచ‌భూతాలు క‌లుషిత‌మ‌య్యాయి. ప్ర‌ధానంగా త్రాగునీరుపై దీని ప్ర‌భావం ఎక్కువ ప‌డుతోంది. భూగ‌ర్భ‌జ‌లాలు పూర్తిగా ప్లాస్టిక్ వ్య‌ర్థాల‌తో క‌లుసిత మ‌య్యాయి. అందుకె నిపుణులు ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ సురక్షితం కాదని పంపు నీళ్లే మేలని నిపుణులు సూచిస్తుంటే ఇప్పుడో షాకింగ్‌ న్యూస్‌ వెల్లడైంది.

దేశ రాజధానిలోని ట్యాప్‌ వాటర్‌లో 80 శాతం పైగా ప్లాస్టిక్‌ వ్యర్థాలతో విషపూరితమైనదని తాజా పరిశోధన బాంబు పేల్చింది. న్యూయార్క్‌, వాషింగ్టన్‌, బీరుట్‌ తర్వాత ఇక్కడే అతిపెద్ద నీటి కాలుష్యం చోటుచేసుకుందని ఈ అథ్యయనం హెచ్చరించింది.

దు ఖండాల నుంచి సేకరించిన 150 పంపునీళ్ల శ్యాంపిల్స్‌ను పరిశీలించిన మీదట అథ్యయనం ఈ అంశాలను వెల్లడించడంతో పంపు నీళ్లంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఢిల్లీలో సంపన్న వర్గాలు పంపు నీళ్లను వాడకపోయినా కోట్లాది సామాన్య ప్రజలు మంచినీళ్ల కోసం ట్యాప్‌ల పైనే ఆధారపడతారు. దీంతో దేశ రాజ‌ధాని ప్ర‌జ‌ల‌కు సుర‌క్షిత నీరు మ‌రువ‌య్యింది.

అమెరికాలో ట్యాప్‌ వాటర్‌ 94 శాతం కలుషితమైంది. శాంపిల్స్‌ను చెక్‌ చేయగా ప్లాస్టిక్‌ ఫైబర్‌లు కంటపడ్డాయి. ఏకంగా కాంగ్రెస్‌ బిల్డింగ్స్‌, న్యూయార్క్‌లోని ట్రంప్‌ టవర్‌లోనూ కలుషిత నీరే అందుబాటులో ఉంది. ఇక లెబనాన్‌లోని బీరట్‌లో ట్యాప్‌ వాటర్‌ 93 శాతం విషపూరితం కాగా, భారత్‌లో ట్యాప్‌ వాటర్‌ 82 శాతం మేర ప్లాస్టిక్‌ వ్యర్థాలతో నిండిఉందని తేలింది.

ఇక బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌లో 72 శాతం కలుషిత నీరు సరఫరా జరుగుతోందని అథ్యయనంలో వెల్లడైంది. తాజా అథ‍్యయనంతో అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా కలుషిత మంచినీటి సమస్యతో సతమతమవుతున్నాయని తేలింది. ప్లాస్టిక్ వ్యర్థాల‌ను కంట్రోల్ చేయ‌క‌పోతె భ‌విష్య‌త్తు మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా ఉంటుంద‌ని నిపుణులు ఆందోళ‌న చెందుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -