సాధారణంగా సోషల్ మీడియా వేదికగా హీరో హీరోయిన్లపై ఎక్కువగా రూమర్స్ రావడం సర్వసాధారణం.అయితే ప్రస్తుతం ఫామ్ లో ఉన్న హీరోయిన్ ల గురించి ఏ చిన్న విషయమైనా హాట్ టాపిక్ గా మారి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటాయి. ఈ క్రమంలోనే మహానటి సినిమా ద్వారా ఎంతో గుర్తింపును సంపాదించుకున్న నటి కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

గత కొద్దిరోజుల నుంచి కీర్తి సురేష్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ ముద్దుగుమ్మ పెళ్లిపీటలు ఎక్కబోతోందని ఒక పారిశ్రామికవేత్తను పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ఇన్ని రోజులు తనపై వస్తున్న ఈ వార్తలకు స్పందించని కీర్తి సురేష్ ఎట్టకేలకు స్పందించాల్సి వచ్చింది.

Also read:నాగార్జున డైరెక్టర్ తో వరుణ్ తేజ్ కొత్త సినిమా..?
తన పెళ్లి గురించి కీర్తి సురేష్ మాట్లాడుతూ ప్రస్తుతం తన దృష్టి మొత్తం సినిమాలపైనే ఉందని, పెళ్లి గురించి ఆలోచన చేయలేదని క్లారిటీ ఇచ్చారు. అయితే తాను పెళ్లి చేసుకుంటే ముందుగా అబ్బాయి ఎవరు ఏంటనే విషయాలు తానే తెలియజేస్తానని చెప్పారు. ప్రస్తుతం ఈమె మహేష్ బాబు సరసన సర్కారీ వారి పాట చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

