Wednesday, May 8, 2024
- Advertisement -

పావలా శ్యామలకు సాయం చేసిన మెగాస్టార్.. ప్రతి నెల?

- Advertisement -

టాలీవుడ్ మెగాహీరో చిరంజీవి మరోసారి తన సేవా గుణాన్ని చాటుకున్నారు. గత రెండు రోజులుగా సీనియర్ నటి పావలా శ్యామల ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న సంగతి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది ఆ విషయం మనందరికీ తెలిసిందే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సీనియర్ నటి శ్యామల ఆర్థిక పరిస్థితులపై స్పందించి ఆమెకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సీనియర్ నటి పావలా శ్యామలకు ‘మా’ అసోసియేషన్ సభ్యత్వంతోపాటు, లక్షా పదిహేను వందల రూపాయలను చెక్ రూపంలో అందించారు. అలాగే ‘మా’ మెంబర్ షిప్ కార్డుతో నెలకు 6 వేల చొప్పున ఫించను అందించేలా సహాయం చేశాడు. మేరకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈసీ సభ్యులు కరాటే కళ్యాణి, సురేష్ కొండేటి శ్యామల ఇంటికి వెళ్ళిస్వయంగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

Also read:బాలయ్య, ప్రభాస్, మహేష్ బాబుకు ఇష్టాలు ఒకేలా ఉన్నయ్యిగా?

సందర్భంగా పావలా శ్యామల మాట్లాడుతూ గతంలో నేను ఆర్థిక సమస్యలలో ఉన్నప్పుడు చిరంజీవిగారు రెండు లక్షల ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారని, మరోసారి కష్టాల్లో ఉన్న నాకు తోడుగా నిలబడి నందుకు మ‌న‌స్ఫూర్తిగా ‘మా’కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా చిరంజీవి గారికి కృతజ్ఞతలు తెలిపారు.

Also read:ఈ సీరియల్స్ హీరోయిన్స్ అసలు వయసు ఎంతో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -