Thursday, May 2, 2024
- Advertisement -

బాహుబలి ని టచ్ చెయ్యడం షారూక్ , ఆమిర్ , సల్మాన్ వలన అవుతుందా ? 

- Advertisement -
Khan’s will reach to Bahubali 2..?

బాహుబలి దీ కంక్లూజన్ చిత్రం కోసం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా యావత్ భారత దేశం ఎదురు చూసేలా చేసాడు జక్కన్న. మొదటి పార్ట్ తో అందరినీ ఆకాట్టుకున్న ఆయన రెండో పార్ట్ విషయం లో కేవలం ఒక్క ట్రైలర్ తో ఆ ఉత్సాహం తీసుకొచ్చాడు.

అద్భుతంగా కట్ చేసిన ట్రైలర్ ని యూ ట్యూబ్ లో ప్రతీ క్షణం కొన్ని లక్షల మంది వీక్షిస్తూనే ఉన్నారు. ఏ భారతీయ చలన చిత్రం సాధించలేని ఘనత ఈ ట్రైలర్ సాధించింది.

మార్చ్ 16 న విడుదల అయిన ఈ ట్రైలర్ 100 మిలియన్ వ్యూస్ ని దక్కించుకుంది. ఈ సంఖ్య ఇప్పటి వరకూ బాలీవుడ్ లోని ఖాన్ త్రయానికి కూడా సాధ్యపడలేదు.. అలాంటిది కనీసం హిందీ సినిమా కూడా కాని బాహుబాలి  2 ఈ గొప్ప ఘనత ని తన ఖాతాలో వేసుకుంది. అన్ని భాషల్లో కలిపి ఈ రికార్డ్ సాధించింది బాహుబలి. 

విడుదల అయిన మొదటి రోజునే యాభై మిలియన్ ల వ్యూస్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం ఎక్కువ లైక్స్ తో కూడా రికార్డ్ సృష్టిస్తోంది. బాహుబలి ని టచ్ చెయ్యడం ఇక షారూక్ , ఆమిర్ , సల్మాన్ ల వల్ల కూడా కాదేమో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -