Thursday, May 9, 2024
- Advertisement -

పవన్ కీ ఇతర హీరోలకీ అదే తేడా 

- Advertisement -
Difference Between Pawan Kalyan and Other Heroes

తమ సినిమా విడుదల అంటే ఒక హీరో కి ఉండే టెన్షన్ అంతా ఇంతా కాదు.. సినిమా సరిగ్గా అవుట్ పుట్ రాలేదు అంటే అతనికి విపరీతమైన భయం , టెన్షన్ ఉంటాయి .. బాగా వచ్చింది అనే కాన్ఫిడెన్స్ ఉంటె ఫుల్లు ఎక్జిట్ గా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం మొదటి నుంచీ వేరుగా ఉంటూ వచ్చింది. ఏ హీరో అయినా తన సినిమా విడుదల అంటే హైదరాబాద్ లో కూర్చుని రిపోర్ట్స్ ఫాలో అవుతూ ఉంటారు. 

అంతెందుకు ఇప్పుడు ట్విట్టర్ లాంటి వాటిల్లో బ్యాక్ టూ బ్యాక్ అప్డేట్ లు వస్తూ ఉండడం తో అవి చూసుకుంటూ ఉంటారు. కానీ కాటమరాయుడు సినిమా విడుదల టైం కి పవన్ ఎక్కడ ఉన్నడో మనం ఇప్పటికే న్యూస్ లో చదివాం. తన కూతురు ఆద్య తో పూణే లో గడిపేసాడు పవన్ కళ్యాణ్. మార్చ్ 23 న పాప పుట్టిన రోజు కావడం తో ఆ వేడుకలలో పవన్ బిజీ అయ్యాడు. ఇక్కడే పవన్ కీ ఇతరులకీ వ్యత్యాసం తెలుస్తోంది. 

రేణూ తో విడిపోయినా పిల్లల విషయం లో చాలా స్ట్రాంగ్ గా ఉండే పవన్ కళ్యాణ్ ఇలా సినిమా విడుదల టైం లో కూడా రిజల్ట్ గురించి ఆలోచించకపోవడం విశేషం . కొందరు హీరోలు ఇచ్చిన ఇంటర్వ్యూ లలో తమ సినిమా విడుదల అప్పుడు నిద్ర పట్టదు అనీ టాక్ , రివ్యూస్ , రేటింగ్స్ చూసుకోవడమే పనిగా ఉంటాను అని చెబుతూ ఉంటారు. వారికి దూరంగా పవన్ ఈ రకంగా ప్రవర్తించడం ఒకింత షాకింగ్ . 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -