Thursday, May 16, 2024
- Advertisement -

హ్యాట్రిక్ కొట్టే పనిలో ఎన్టీఆర్ ?

- Advertisement -

ఒకప్పుడు మెగా స్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ లాంటి వారికే పోటీగా బాక్స్ ఆఫీస్ దగ్గర దున్నేసాడు జూనియర్ ఎన్టీఆర్. ఆది సింహాద్రి రోజుల్లో శిఖరాగ్రం చేరుకున్న ఇతను తర్వాత ఆ రేంజ్ లో సినిమాలు లేక కుదేలు అయిపోయాడు.

మధ్యలో అడపా దడపా యమదొంగ-బృందావనం-అదుర్స్-బాద్ షా లాంటి సినిమాలతో జోరులోనే ఉన్న ఎన్టీఆర్ బృందావనం-అదుర్స్ లాంటి హిట్స్ తరువాత శక్తి సినిమాతో హాట్రిక్ ని మిస్ అయ్యాడు. మళ్ళీ ఇన్నేళ్ళ విరామం తరవాత హాట్ ట్రిక్  బ్లాక్ బస్టర్ లు కొట్టే అవకాశం దక్కింది ఎన్టీఆర్ కి.

జనతా గ్యారేజ్ సినిమా తో ఆగాస్ట్ 12 న కొరటాల శివ డైరెక్షన్ లో రాబోతున్న ఎన్టీఆర్ భారీ అంచనాలతో కనిపిస్తున్నాడు. ఈ సినిమా హిట్ కొట్టి తన కెరీర్ లో పూర్తి కాని హాట్ ట్రిక్ ని ఈ సారైనా పూర్తి చెయ్యలానేది ఎన్టీఆర్ ఆలోచన. ఈ సారి ప్రయోగాల జోలికి వెళ్ళకుండా సరైన హిట్ కొట్టి తానెంతో నిరూపించుకోవడం కోసమే కొరటాల శివ లాంటి హిట్ కొట్టిన డైరెక్టర్ వెంట పడ్డాడు అనేది భోగట్టా. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -