Thursday, May 9, 2024
- Advertisement -

హీరోలను ఏకేసిన కోట శ్రీనివాస్

- Advertisement -

విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు గురించి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం అంటూ ఏమీ లేదు . ఈయన ఎన్నో గొప్ప చిత్రాలలో నటించి నెగెటివ్ షేడ్స్ లో తనకి మించిన నటుడు లేడు అనిపించుకున్న నటుడు..అయితే గత కొద్దికాలంగా ఆయనకీ చిత్రాలలో అవకాశాలు కల్పించడం లేదు..పాత్రలు కరువయ్యాయి..తాజాగా సప్తగిరి సినిమాలో నటించినా అది కూడా ఎదో అలా కనిపించారు.. వయసు మీద పడుతుండటం కూడా తనకి అవకాశాలు రాకపోవడానికి కారణంగా చెప్పవచ్చు.. అయితే..ఇప్పుడు కోటా నటించక పోయినా సరే సంచలనం అయ్యారు.. కోటా మాట ఇప్పుడు టాలివుడ్ లో ఎంతో మంది నటులకి చిర్రెక్కిస్తున్నాయి. ఒకప్రముఖ మీడియా సంస్థకు లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో కోట ఇండస్ట్రీ గురించి ఇండస్ట్రీలోని వ్యక్తుల గురించి పవన్ కళ్యాణ్ రాజకీయాలగురించి రోజా కామెంట్స్ గురించి అనేక కామెంట్స్ చేశాడు.. మీసం గడ్డం రానివాళ్ళు కూడ హీరోలు అయ్యిపోతున్నారు.. వారికి తెలుగుమాట్లాడటం రాకపోయినా కొన్నాళ్ళు విశాఖపట్టణం వెళ్లి అక్కడ ఒకప్రముఖ వ్యక్తిదగ్గర డైలాగ్స్ నేర్చుకుని అక్కడ నుండి ముంబాయి వెళ్లి డాన్స్ లు నేర్చుకుని తాము హీరోలం అయిపోయాం అంటూ బిల్డప్ ఇస్తున్నారు అంటూ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ లో ఓ హీరోకి గట్టిగానే తగిలాయి..

అంతేకాదు మెగా నందమూరి కుటుంబాల నుండి వస్తున్న యంగ్ హీరోలను కూడా టార్గెట్ చేస్తూ వచ్చిన కామెంట్స్ ఆయా హీరోల అభిమానులకి కోపాన్ని తెప్పిస్తున్నాయి… “అంటే కోపం వస్తుంది కానీ ఇపుడు ఇండస్ట్రీలో పాతిక ముప్పై మంది దాకా హీరోలుగా ఉన్నారు. సొంత పేరు మీద వచ్చినవాడు ఎవడైనా ఉన్నాడా? ప్రతివాడు చిరంజీవి మేనల్లుడు, చిరంజీవి బావమరిది కొడుకులు, రామారావుగారి మనవడు ఇట్లా తప్ప వారి పేరు మీదవచ్చేవారు తక్కువ. నాని అనే కుర్రవాడు ఒకడు తనసొంత పేరుతో ఎదిగాడు. ఇదివరకు అలా కాదే’ అంటూ కోట శ్రీనివాసరావు ఘాటైన కామెంట్స్ చేశాడు. దర్శకత్వంలో సరైన అవగాహన లేని వాళ్ళు సైతం ఇప్పుడు డైరెక్టర్ అయిపోతున్నాడు..సినిమాలు అంటే విలువలు లేకుండా పోతున్నాయి అన్నారు కోట..అంతేకాదు.. అంతేకాదు ఇదేసందర్భంలో కోట కామెంట్స్ ‘బాహుబలి’ పై కూడ మళ్ళాయి. ‘బాహుబలి’ సినిమా విడుదలకు రెండునెలల ముందు విడుదలైన తర్వాత రెండునెలల తరువాత ఆసినిమా గురించి దేశంలోని అందరూ ఊదర కొట్టేసిన నేపధ్యాన్ని గుర్తుకు చేసుకుంటూ ఇప్పుడు జనం ‘బాహుబలి’ గురించి మర్చిపోయి మరోకొత్త సినిమా గురించి మాట్లాడుతున్నారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

అంతేకాదు “పవన్ కళ్యాణ్” రాజకీయాలలోకి వస్తున్న విషయంపై స్పందిస్తూ రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు. అయితే రాజకీయాలలో సహనం అనేది చాలా ముఖ్యమైన విషయం అంటూ పవన్ కి చురకలు అంటించారు.. అయితే ఎప్పుడు లేని విధంగా ఒక్కసారిగా యంగ్ హీరోలు దర్శకులు పవన్ పై ఒకే సారి ఇలా కామెంట్స్ చేయడం సంచలనం సృష్టిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -