- Advertisement -

‘కాంచన 4’ లో లేడీ సూపర్ స్టార్!

- Advertisement -

లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ఆమె ‘హాయ్’, ‘టాక్సిక్’, ‘డియర్ స్టూడెంట్స్’ వంటి విభిన్నమైన సినిమాలతో పాన్-ఇండియా స్థాయిలో దూసుకుపోతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ అందాల తార ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టులో భాగం కాబోతోంది.

ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ (Raghava Lawrence) హీరోగా నటిస్తూ, స్వయంగా తెరకెక్కిస్తున్న మోస్ట్ అవేటెడ్ హారర్-కామెడీ ఫ్రాంచైజీ చిత్రం ‘కాంచన 4’ (Kanchana 4). ఈ సినిమాలో నయనతార ఒక ప్రత్యేకమైన మరియు పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా, ఈ సినిమా కథలోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో నయనతార పాత్ర చాలా కీలకంగా ఉంటుందని, ఆ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని సమాచారం.

‘కాంచన’ సిరీస్ అంటేనే భారీ హారర్ ఎలిమెంట్స్ అండ్ కామెడీకి పెట్టింది పేరు. ఈ కొత్త భాగంలో నయనతారతో పాటు స్టార్ బ్యూటీస్ పూజా హెగ్డే (Pooja Hegde), డ్యాన్స్ క్వీన్ నోరా ఫతేహి (Nora Fatehi) కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. వీరి కాంబినేషన్ ఈ హారర్-కామెడీ డ్రామాను ఏ రేంజ్ లో ఎలివేట్ చేస్తుందో అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నయనతార రాకతో ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. రాఘవ లారెన్స్ తన మార్క్ భయానక కామెడీతో ఈసారి ప్రేక్షకులను ఏ స్థాయిలో భయపెట్టి, నవ్విస్తాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -