Thursday, March 28, 2024
- Advertisement -

పూరీ ఇంక లైట్ తీసుకో !

- Advertisement -

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ లెక్క ఈ మధ్య తప్పిందనే అనాలి. టెంపర్, జ్యోలక్ష్మి, లోఫర్ అంటూ ఈ ఏడాది ఫ్యాన్స్ ని ఖుషి చేసేందుకు ముందుకు వచ్చినా టెంపర్ తప్పించి మిగతా రెండు దాదాపు పోయినట్టే అనుకున్నారు. అయితే ఈ నెల 17న రిలీజ్ అయిన వరుణ్ తేజ్ లోఫర్ హీరోకి మంచి కమర్షియల్ లుక్ ఇచ్చినా సినిమా మాత్రం బోల్తా పడ్డది.

అయితే లాస్ట్ వీక్ రిలీజ్ అయిన ఈ సినిమా బలమైన కథ కథనాలు లేకపోయినా పూరి మార్క్ స్టైలిష్ టేకింగ్ తో ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించుకుంటున్నాడు.ఇక సినిమా అయితే దాదాపు పోయినట్టే అనుకున్నా ఈ క్రిస్ మస్ సీజన్లో వచ్చిన ఏ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోకపోవడంతో లోఫర్ మీద ఆశలు పెంచుకున్నాడు పూరి జగన్నాథ్.

అందుకే శనివారం తన ఆఫీస్ లో సక్సెస్ మీట్ అంటూ ఒకటి పెట్టాడు. అసలు సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా పట్టించుకోని పూరి ఇలా తన సినిమా బిలో యావరేజ్ టాక్ తో నడుస్తున్న సినిమా కోసం ఇంకా ఏదో అద్భుతాలు జరుగుతాయని ప్రెస్ మీట్ పెట్టాడు. మరి ఈ ప్రెస్ మీట్ అర్ధం ఏంటో పూరికే తెలియాలి.

సినిమా టాక్ తో సంబంధం లేకుండా ఇంకా సినిమా చూడని వారు ఎవరైనా ఉంటే పూరి కోసమైనా సినిమా చూస్తారేమో. మొత్తానికి జరిగిపోయిన పెళ్లికి మంగళ వాయిద్యాలు అని వారం క్రితం సినిమా రిలీజ్ అయ్యి దాదాపు థియేటర్స్ నుండి ఎత్తే టైంలో సినిమా సక్సెస్ మీట్ పెట్టడం కాస్త హాస్యంగానే ఉంది పూరి అని జోకులేసుకుంటున్నారు నెటిజెన్లు.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -