Tuesday, May 21, 2024
- Advertisement -

అంత వరస్ట్ సినిమాకి మళ్ళీ సీక్వెల్ ఎందుకు బాబోయ్ !

- Advertisement -

చాలామంది స్టార్ హీరోలు తమ హిట్ సినిమాల సీక్వెల్ లో నటించాలని భావిస్తుంటారు. కానీ బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ మాత్రం తన కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫెయిల్యూర్స్ లో ఒకటిగా నిలిచిన సినిమా సీక్వెల్ కు సన్నాహాలు చేస్తున్నాడని వినిపిస్తోంది. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

రీసెంట్ గా దిల్ వాలే మూవీతో ఆడియెన్స్ ముందుకొచ్చిన షారుఖ్ కు, ఈ సినిమా కూడా ఆశించినంతగా ఫలితాన్నిచ్చేటట్టు లేదని టాక్. ఈ నేపథ్యంలో ఆచితూచి అడుగేస్తాడునుకున్న షారుఖ్ ఫ్లాప్ మూవీ రా వన్ సీక్వెల్ లో నటించబోతున్నాడనే న్యూస్ ప్రస్తుతం బాలీవుడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.

ఇప్పటికే రా వన్ మూవీ సీక్వెల్ లో నటించేందుకు షారుఖ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, ఈ మూవీకి జీ వన్ అనే టైటిల్ కూడా ఫిక్స్ అయ్యిందని బీ టౌన్ లో వినిపిస్తోంది. అయితే రోబోకు సీక్వెల్ చేస్తున్నందువల్లే షారుఖ్ ఈ నిర్ణయం తీసుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఏదేమైనా ఫ్లాప్ మూవీకి సీక్వెల్ అంటే షాకింగ్ న్యూసే మరి. అయితే ‘రా వన్’ కి సీక్వెల్ ఉంటుందో లేదో ఇప్పుడే చెప్పలేమంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -