Monday, May 6, 2024
- Advertisement -

‘బ్రహ్మోత్సవం’ ఇన్ సైడ్ టాక్!

- Advertisement -

మహేష్ బాబు, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‍లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’  మంచి విజయం సొంతం చేసుకుంది. మళ్లీ ఈ ఇద్దరి కాంబినేషన్‍లో వస్తున్న చిత్రం బ్రహ్మోత్సవం. ఇప్పటికే ఈ చిత్రంపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈనెల 20న విడుదలకు సిద్ధమైనది.

పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న చిత్రం సోమవారం సెన్సార్ పూర్తిచేసుకుని క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ పొందింది. సింగిల్ కట్ కూడా లేకుండా సెన్సార్ పూర్తిచేసుకుని శుక్రవారం విడుదలకు రెడీ అయింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం సెన్సార్ టాక్ అంటూ కొందరు ఇన్ సైడ్ టాక్ అంటూ కొందరు సినిమాపై ఓ టాక్ ని వెబ్ మీడియాలో ప్రచారంలోకి తీసుకువచ్చారు.

ఈ సినిమా ఫస్టాఫ్ చాలా స్మూత్ గా , ఫన్నీ సీక్వెన్స్ లతో సాగిపోతుందని, అయితే సెకండాఫ్ కు వచ్చేసరికి లాగ్ ఉంటుందని, కొంత ఎమోనల్ మెలోడ్రామా ఉండటమే దానికి కారణమని , కొంచెం ఇక్కడ ప్రేక్షకుడు ఇబ్బంది పడతారని అంటున్నారు. అయితే క్లైమాక్స్ కు వచ్చేసరికి అంతా సర్దుకుంటుందని, ముఖ్యంగా ప్రి క్లైమాక్స్ లో మహేష్ తన నటనతో సినిమాని ఎక్కడికో తీసుకు వెళ్లిపోయాడని ఈ టాక్ సారాంశం. అయితే ఇది రాయటానికి సినిమానే చూడక్కర్లేదు. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు దర్శకుడు కాబట్టి ఆ సినిమాలాగానే ఇదీ ఉంటుందని ఊహించి రాసేసారని ఓ వర్గం అంటోంది. అయితే ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్, టీజర్స్, మేకింగ్ వీడియోలు సినిమాపై ఓ రేంజిలో హైప్ క్రియేట్ చేసాయి..మరి వాటిని ఏ స్దాయిలో నిలబెట్టుకుంటుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -