Friday, May 3, 2024
- Advertisement -

బరువు తగ్గుటకు చిట్కాలు!

- Advertisement -

అధిక బరువు ఉన్న వారు చాలా ఇబ్బందులు పడుతుంటారు. అలాగే ఆధిక బరువు వల్ల చాలా సమస్యలు కూడా వస్తుంటాయి. బరువు తగ్గడం కోసం చాలా పద్దతులు పాటిస్తుంటారు. ఇక్కడ కూడా సింపుల్ గా బరువు తగ్గుటకు కొన్ని టిప్స్ ఇవ్వబడ్డాయి అవి ఇప్పుడు చూద్దాం.

* బరువు తగ్గాలనుకునే వారు వారానికి ఒక రోజు అన్ని పూటలూ భోజనానికి బదులుగా కూరగాయలు, ఆకుకూరలతో చేసిన సలాడ్ తీసుకుంటే ఫలితం ఉంటుంది. దీంతోపాటు శరీరానికి కావల్సిన పోషకాలు కూడా తగినంతగా లభిస్తాయి. 

* తగిన చోటు, సమయం చూసుకుని కూర్చుని భోజనం చేయాలి. ఆహారాన్ని బాగా నమిలి మింగాలి. దీంతో అది త్వరగా జీర్ణమవుతుంది. 

* సాధ్యమైనంత చిన్న సైజ్ ప్లేట్‌లో భోజనం చేస్తే మీకు తెలియకుండానే పూటకు కనీసం 250 క్యాలరీలైనా తగ్గించి తింటారు. 

* నిద్రలేచిన గంటలోపే బ్రేక్‌ఫాస్ట్ పూర్తి చేయాలి. ఆలస్యంగా తింటే రెండు భోజనాల మధ్య సమయం తగ్గి కొవ్వు పెరుగుతుంది. 

* రోజూ పాల ఉత్పత్తులు ఎంతో కొంత పరిమాణంలో తీసుకోవాలి. వీటిలోని కాల్షియం కొవ్వుని కొంత మేరకు తగ్గించగలదు. 

* వ్యాయామం చేసిన తరువాత 30 నుంచి 60 నిమిషాల లోపు భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి. కొత్తగా చేరే క్యాలరీలను శరీరం అలసిపోయినప్పుడు వెంటనే ఉపయోగించుకుంటుంది. 

* భోజనానికి ముందు నారింజ లాంటి నిమ్మజాతి పండు సగం తింటే బరువు తగ్గుతారని పరిశోధనల్లో తెలిసింది. 

* వారంలో 3 రోజులు గుడ్లు, ఒక పూట చేప తినడం కూడా బరువు తగ్గించేందుకు ఉపయోగపడుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -