Thursday, May 16, 2024
- Advertisement -

ఆ డేట్ ని మహేశ్ బుక్ చేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ తగ్గుతాడా ?

- Advertisement -

తెలుగు సినిమాలో ఒక కొత్త పంథా ని మొదలు పెట్టాడు మహేష్ బాబు హాలీవుడ్ , బాలీవుడ్ లలో లాగా సినిమా షూటింగ్ అప్పుడే విడుదల తేదీని ప్రకటించడం మహేష్ కి అలవాటు. దాన్ని రాం చరణ్ కూడా చక్కగా ఫాలో అవుతూ ఉండగా వేరే హీరోలు ఈ విషయంలో పెద్ద ఆసక్తి చూపించడం లేదు.

నిజానికి ఇలా సినిమా విడుదల తేదీని షూటింగ్ సమయంలో లేదా షూటింగ్ కంటే ముందరే ప్రకటించడం చాలా ప్రొఫెషనల్ విషయం. అప్పుడే వ్యాపార పరంగా లెక్కలు సరిగ్గా ఉంటాయి. సినిమా వచ్చే సమయం ఎంచుకుని ఆ సమయం బట్టి ఏ హీరో ఎలా ఎప్పుడు వస్తాడు దానివల్ల మన సినిమా కీ వారి సినిమాకీ ఎంత గ్యాప్ పెట్టుకోవచ్చు అని తెలుస్తుంది. రాం చరణ్ గత రెండు సినిమాలూ చాలా ఇబ్బందులు ఎదురు అయినా కూడా సమయానికి విడుదల చేసాడు.

గోవిందుడు అందరివాడేలే సినిమా సమయంలో రాం చరణ్ కి ఇంకా ఒక పాట షూటింగ్ కూడా మిగిలి ఉండగా విడుదల చేసి తన కమిట్మెంట్ ని నిరూపించుకున్నాడు. మొన్న కూడా బ్రూస్ లీ సినిమా విడుదల సమయం లో భారీ గా అతని మీద వాయిదా కోసం ఒత్తిడి వచ్చిన తరుణం లో రాం చరణ్ సినిమా ని విడుదల చేసి తీరతాను అని ప్రకటించి విడుదల చేసి చూపించాడు. మహేష్ , రాం చరణ్ లలో ఈ ప్రొఫెషనల్ యాంగిల్ మిగితా హీరోలు కూడా పాటిస్తే ఏ సినిమా కీ క్లాష్ సమస్య ఉండదు.

అయితే ఇప్పుడు ఏప్రిల్ ఎనిమిది న తన బ్రహ్మోత్సవం విడుదల చెయ్యాలి అని చూస్తున్న మహేష్ బాబు సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలో విసుగ్గా ఉన్నాడు. ఆ సినిమా నిర్మాత శరత్ తో పీవీపీ ఎన్ని సంప్రదింపులు చేసినా వారు తమ సినిమా విడుదల విషయం బయటకి చెప్పకపోవడంతో తన సినిమా అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నాడు. మరొక పక్క సరైనోడు అంటూ అల్లూ అర్జున్ విడుదల కి సర్వం సిద్దం చేస్తున్నాడు. మహేష్ కర్చీఫ్ అయితే వేసేసాడు మిగితా వారు కాస్త నేమ్మదిస్తే అందరికీ మంచిది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -