Thursday, May 16, 2024
- Advertisement -

భూ తగాదాలే కారణమా?

- Advertisement -

చిత్తూరులో దారుణం జరిగింది. సాక్షాత్తూ నగర మేయర్.. కఠారి అనూరాధను దుండగులు అతి కిరాతకంగా చంపేశారు. మేయర్ కార్యాలయంలో ఉన్న ఆమెను టార్గెట్ చేశారు. ముసుగులు వేసుకుని వచ్చిన కొందరు అనూరాధతో పాటు.. ఆమె భర్త మోహన్ పైనా విచక్షణా రహితంగా దాడి చేశారు.

తమ వద్ద ఉన్న తుపాకితో పలు రౌండ్లు కాల్పులు జరపడంతో చిత్తూరు మేయర్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. పాయింట్ బ్లాంక్ రేంజ్ టార్గెట్ గా జరిగిన ఈ దాడిలో.. అనూరాధ క్షణాల్లో శవంగా మారిపోయారు.మరోవైపు.. దాడిని అడ్డుకోబోయిన అనూరాధ భర్త, టీడీపీ సీనియర్ నాయకుడు కఠారి మోహన్ పైనా దుండగులు దాడికి తెగబడ్డారు.

కత్తితో తీవ్రంగా పొడిచారు. పరిస్థితి విషమంగా మారడంతో తమిళనాడు వేలూరులోని సీఎంసీలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నా.. ప్రస్తుతానికి స్పృహలోకి వచ్చినట్టు తెలుస్తోంది.

ఇద్దరిపై కిరాతక దాడి చేసిన ముగ్గురు దుండగులు.. ఆ వెంటనే పారిపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు మీడియాకు చెప్పారు. దాడి జరిగిన తర్వాత.. ఇద్దరు చిత్తూరు పోలీస్ స్టేషన్ లో.. మరో వ్యక్తి కోర్టులో లొంగిపోయారు. ఈ దాడిలో మొత్తం ఆరుగురు పాల్గొన్నారని.. వారంతా కర్ణాటక ముఠాకు చెందిన వారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు ఈ దారుణంపై స్పందించారు. మహిళపై దాడిచేసి హతమార్చిన దుండగులను వదిలేది లేదన్నారు. ఈ ఘటన తనకు తీవ్ర విషాదాన్ని మిగిల్చిందన్నారు. అయితే.. అనూరాధ హత్య వెనక వేరే కారణాలు వినిపిస్తున్నాయి. ఆమె భర్త కఠారి మోహన్ కు.. సొంత కుటుంబీకులతోనే భూ తగాదాలున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. కొందరు సీనియర్ నాయకులతో కూడా రాజకీయ విబేధాలున్నాయి. ఈ రెండు కారణాల్లో.. ఏదో ఒకటి అనూరాధ విషాదాంతానికి కారణమై ఉంటుందని కొందరు అనుమానిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -