- Advertisement -

మహేష్ బాబు కృష్ణల నాన్నకు ప్రేమతో సాంగ్ సూపర్ ఉంది

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో మూవీ మంచి రికార్డులు సృష్టించింది. నాలుగు సినిమాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా మంచి పాజీటివ్ టాక్ సొంతం చేసుకోని ఇక్కడే కాకుండా ఓవర్సీస్ లోనూ ప్రభంజనం సృష్టిస్తోంది. మాములుగా ఎన్టీఆర్ సినిమాలు సీడెడ్ లో కలెక్షన్స్ అద్భుతంగా వస్తాయి.

కానీ ఈ సారి ఇదే రేంజ్‍లో ఓవర్సీస్ లోనూ వసూళ్లు సాధించడం విశేషం. ఎన్టీఆర్, రకుల్ ప్రీత్ జంటగా నటించిన ఈ మూవీ.. ఇప్పుడు ఆల్ టైం ఓవర్సీస్ టాప్ లిస్ట్‌లోకి చేరిపోయింది. ఎన్టీఆర్ కెరీర్‍లోనే హిట్గా నిలిచిపోతుంది అంటున్నారు విశ్లేషకులు. సుకుమార్ కూడా చాలా అద్భుతంగా ఈ సినిమాని తెరకేక్కించాడు.

ఈ సినిమాలో నాన్నకు ప్రేమతో సాంగ్ చాలా ఫేమస్ అయ్యింది. ఐతే ఇదే సాంగ్‍ని మెగా అభిమానులు రామ్ చరణ్ అతని నాన్న అయ్యిన మెగా స్టార్ చిరంజీవికి అంకితం చేస్తూ ఉన్నట్టుగా తయారు చేసిన వీడియో ఇప్పుడు యుట్యూబ్‍లొ హల్ చల్ చేస్తుంది. మెగా అభిమానులు తయారు చేసినట్లే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు కూడా ఇలాంటి సాంగ్ తయారు చేసారు. ఇప్పుడు ఈ వీడియో యుట్యూబ్‍లో హల్ చల్ చేస్తుంది.

{youtube}v=sQBmWIqz4vQ{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -