Friday, March 29, 2024
- Advertisement -

సుకుమార్ విషయంలో మహేష్ తప్పు చేశాడా ?

- Advertisement -

మహేష్ బాబు మహర్షి తర్వాత సుకుమార్ తో ఓ సినిమా చేయసేందుకు రెడీ అయ్యాడు. అయితే కానీ వారి మధ్య ఏవో మనస్పర్దాలు రావడంతో మహేష్ కు తెలియకుండానే సుకుమార్ అల్లు అర్జున్ తో సినిమాని అనౌన్స్ చేశాడు. దాంతో మహేష్ కి ఏం చేయాలో అర్దం కాలేదు. అయితే కామెడీ సినిమాలతో మంచి ఊపు మీదా ఉన్న అనిల్ రావిపూడిని పిలిచి కథ సిద్దం చేయించి.. సరిలేరు నీకెవ్వరు సినిమాతో వచ్చాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది.

కానీ మహేశ్ గత కొన్ని సినిమాల నుంచి ఒకే లుక్ లో కనిపిస్తున్నాడు. ఇది ఫ్యాన్స్ కి కాస్త నిరాశ కలిగించే విషయమే. అయితే అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాతో బిజీగా ఉండటంతో కొన్ని రోజులు సుకుమార్ వేచి చూసి మొత్తానికి బన్నీతో సినిమా మొదలు పెట్టి తాజగా అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను టైటిల్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ లుక్ కు మంచి స్పందన వస్తుంది. నిజానికి ఈ సినిమానే మహేష్ తో సుకుమార్ చేయాలి.

మరి వారి మధ్య ఏ మనస్పర్దాలు వచ్చాయో తెలియదు కానీ ఆ అవకాశం బన్నీని వరించింది. అయితే బన్ని లుక్ గురించి తెలిసాక.. మహేష్ ఆ జుట్టు, గడ్డం పెంచడంపై సుకుమార్ తో వద్దు అని చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే సుకుమార్ కూడా ఏం చేయాలేక ఆ కథతో బన్నీని లైన్ లో పెట్టాడు. ఏది బన్ని లుక్ చుశాక మహేష్ మంచి అవకాశం మిస్ చేసుకున్నాడని అర్దం అవుతుంది. మరి బన్నీ సినిమా హిట్ అవుతే మహేష్ అభిమాలు మరింత ఫీల్ అవుతారేమో..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -