Sunday, May 5, 2024
- Advertisement -

అకీరాను మర్చిపోయిన పవన్ కళ్యాణ్ ?

- Advertisement -

ఈ రోజు పవన్ కళ్యాణ్ పెద్ద కుమారుడు అకీరా నందన్ బర్త్ డే. 2004 ఏప్రిల్ 8న జన్మించిన అకీరా వయసు ఇప్పుడు 16. పవన్-రేణూ దేశాయ్ ల మొదటి సంతానమే అకీరా. బద్రి సినిమాలో పవన్ రేణు కలిసి నటించారు. తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. కారణాలేమైనా 2012లో పవన్ రేణూ దేశాయ్ కి విడాకులు ఇవ్వడం జరిగింది.

చట్టబద్దంగా విడిపోయిన వీరు.. చాలా కాలంగా విడివిడిగా ఉంటున్నారు. 2013లో తీన్ మార్ సినిమాలో నటించిన అన్నా లెజినోవాను పవన్ పెళ్లి చేసుకున్నారు. ఇక నేడు అకీరా పుట్టిన రోజుకు పవన్ అన్నగారైన మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. రామ్ చరణ్ కుడా శుభాకాంక్షలు తెలిపారు. ఐతే సొంత తండ్రి పవన్ మాత్రం అకీరాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పకపోవడం సంచలనం రేపుతోంది. ఇందుకు కారణం ఏంటో అంతుబట్టడం లేదు.

అయితే పవన్ తో రేణు దేశాయ్ విడిపోయిన తర్వాత పవన్ పై పరోక్షంగా ఆరోపణలు చేసింది. అసలు పిల్లలతో పవన్ కి సంబంధం లేదన్నట్లు కామెంట్స్ చేసింది. విడాకుల తరువాత ఆర్ధిక ఇబ్బందుల గురించి కూడా చెప్పి బాధపడింది. ఈ క్రమంలో ఆమెకు భయపడే పవన్ కొడుకు అకీరాను సోషల్ మీడియా ద్వారా బహిరంగంగా విషెష్ చెప్పలేదా అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -