Monday, May 13, 2024
- Advertisement -

మెగా ఫ్యామిలీని రెచ్చగొడుతున్న మహేశ్ సినిమా లెక్కలు!

- Advertisement -

ఇంకా బ్రహ్మోత్సవం సినిమా తొలి షెడ్యూల్ ను మాత్రమే పూర్తి చేసుకొంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన లెక్కలు మాత్రం ఇప్పుడు మెగా ఫ్యామిలీకి మరో సవాలుగా మారాయి.

ఒకవైపుచరణ్ సినిమా ‘బ్రూస్ లీ’ వార్తల్లోకి వచ్చిన నేపథ్యంలో.. విడుదలకు సిద్దం అవుతున్న నేపథ్యంలో అందరూ ఆ సినిమా వసూళ్ల గురించి మాట్లాడుకోవాల్సిన తరుణంలో ఎప్పుడో విడుదల అయ్యే మహేశ్ సినిమా ఉన్నట్టుండి వార్తల్లోకి వచ్చింది. అందరూ చరణ్ సినిమా గురించి మాట్లాడుకోవాల్సిన తరుణంలో మహేశ్ సినిమా నే మళ్లీ వార్తల్లోకి రావడం మెగా ప్యామిలీకి ఇబ్బందికరంగా మారింది.

ఇప్పుడు అంతటా బ్రహ్మోత్సవం సిని గురించి చర్చ జరుగుతోంది. ఆ సినిమా ఓవర్సీస్ హక్కులను గరిష్ట మొత్తానికి అమ్ముతున్నారని.. ఇంత వరకూ ఏ తెలుగు సినిమా అమ్ముడుపోని రీతిలో ఏకంగా పదహారు కోట్ల రూపాయల స్థాయిలో బ్రహ్మోత్సవం ఓవర్సీస్ రైట్స్ అమ్ముడయ్యాయని అంటున్నారు. మరి ఇది చరణ్ సినిమాకు సవాలు విసిరేదే.

ప్రస్తుతం చరణ్ సినిమా బ్రూస్ లీకి సంబంధించి మార్కెట్ గురించి కూడా చర్చ జరగాల్సి ఉంది. ఇలాంటి నేపథ్్యంలో మహేశ్ సినిమా సెట్ చేసిన రికార్డులను చరణ్ అందుకోగలడా? అందుకోలేడా? అనే పోలిక పెడుతున్నారు సినీ విశ్లేషకులు. ప్రస్తుత పరిస్తితుల్లో అయితే.. చరణ్ సినిమా మహేశ్ రికార్డులను అందుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. ఈ విధంగా మహేశ్ సినిమా  ఎప్పుడో విడుదలవ్వబోతూ కూడా ఇప్పుడు మెగా ఫ్యామిలీని ఇబ్బంది పెడుతోంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -