Monday, May 6, 2024
- Advertisement -

ఒక హీరోతో విడాకులు.. మరో హీరోతో చెట్టాపట్టాల్!

- Advertisement -

టిప్పూ సూల్తాన్ అనే ఫేమస్ టీవీ సీరియల్ ను రూపొందించిన సంజయ్ ఖాన్ కూతురు సుజానే. ఆమె తనకు చిన్నప్పటి స్నేహితుడు అయిన హృతిక్ తో చాన్నాళ్ల పాటు సహజీవనం చేసింది. చివరకు వారిద్దరూ వివాహం చేసుకున్నారు.

ఇద్దరు పిల్లలను కొన్నారు. దాదాదాపు పన్నెండేళ్ల పాటు హ్యాపీగానే గడిపారు. అయితే… ఏమైందో ఏమో కానీ వారిద్దరూ ఉన్నట్టుండి విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ఎవరికి వారయ్యారు. మరి బాలీవుడ్ లో స్టార్ హీరోగా.. ప్రపంచంలోనే మోస్ట్ సెక్సీయెస్ట్ మేల్స్ లో ఒకడిగా ఉన్న హృతిక్ వైవాహిక జీవితం అలాంటి మలుపు తీసుకోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.

మరి ఆ సంగతి అలా ఉంటే.. ఇప్పుడు సుజానే ఒక బాలీవుడ్ హీరోతో సన్నిహితంగా ఉంటున్న విషయం చర్చనీయాంశంగా మారింది. అతడే అర్జున్ రాంపాల్. అతడితో ఆమె అనుబందం ఇప్పటిది కాదని అంటారు. హృతిక్ తో ఆమె విడాకులు తీసుకోవడానికి కారణం కూడా అతడేనని ప్రచారం ఉంది. అయితే విడాకుల తర్వాత ఇప్పుడు సుజనే రాంపాల్ కు మరింత దగ్గరైంది. వీరిద్దరూ కలిసి విహరిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంవీరిద్దరూ పెళ్లి చేసుకొంటారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే సుజానే మాత్రం పెళ్లి వార్తలను ఖండిస్తోంది. తనకు ఆ ఉద్దేశం లేదని అంటోంది. మరి ఇదంతా చూస్తుంటే.. సుజనే పెళ్లి చేసుకోకుండా ఆ హీరోతో సన్నిహితంగా గడుపుతుందేమో అనుకోవాల్సి వస్తోంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -