Thursday, May 9, 2024
- Advertisement -

ఎన్టీఆర్ కోసం మలయాళ విలన్

- Advertisement -

ఒక పక్క యంగ్ టైగర్ ఎన్టీఆర్ 25 వ సినిమా యాభై కోట్ల కలక్షన్ ని దాటి దూసుకుపోతూ ఉంటే అతని 26 వ సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా కి జనతా గ్యారేజీ అనే వర్కింగ్ టైటిల్ కూడా ఫిక్స యిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలో ఓ మెయిన్ రోల్ కోసం మోహన్ లాల్ ని ఫిక్స్ చేసారు.

అలాగే ఫిబ్రవరి 10నుంచి మొదలు కానున్న మొదటి షెడ్యూల్ కూడా మోహన్ లాల్ పైనే షూట్ చేయనున్నారు. మరొక పక్క మొన్నటి వరకూ ఎన్టీఆర్ కోసం ధీటైన విలన్ ని వెతికే పనిలో పడ్డాడు డైరెక్టర్ శివ. చివరకి విలన్ ని కూడా మలయాళ ఇండస్ట్రీ నుంచే పట్టుకొచ్చారు. ప్రస్తుతం మలయాళ సినిమాల్లో ఎదుగుతున్న ముకుందన్ ని జనతా గ్యారేజీ లో విలన్ పాత్ర కి ఒప్పించారు.

‘మొదటిసారి మోహన్ లాల్ గారితో స్క్రీన్ పంచుకోనున్నాను. అది కూడా విలన్ గా కనిపించనుండడం చాలా హ్యాపీగా ఉంది. ఈ అవకాశం ఎన్.టి.ఆర్ జనత గ్యారేజ్ లో దక్కింది. ఎన్.టి.ఆర్, కొరటాల శివ, మైత్రి మూవీస్ వారితో అసోషియేట్ అయ్యి ఈ సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉందని’ అతను ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -