Sunday, May 12, 2024
- Advertisement -

నన్ను తీసేసే ధైర్యం ఎవ్వరికీ లేదు – బ్రాహ్మీ

- Advertisement -

ఫార్మ్ లో ఉన్నా లేకపోయినా తెలుగు ఇండస్ట్రీ లో తన స్థానం తనకే పరిమితమయ్యి ఉంటుంది అంటున్నాడు బ్రహ్మానందం. తన పని అయిపొయింది అనీ , నెమ్మదిగా సర్డుకోవడమే అనీ చేస్తున్న వ్యాఖ్యల పట్ల మాట్లాడిన బ్రాహ్మీ యా ప్రచారం లో అర్ధం లేదు అంటున్నారు. హాస్యం తనతో పుట్టినది కాదు అనీ తనతో అంతరించిపోదు కదా అనీ ఎదురు ప్రశ్నిస్తున్నారు ఆయన.

ఎంతమంది కమీడియన్ లు వచ్చినా తన స్థానం పదిలంగా అలాగే ఉంటుంది అంటున్నారు ఆయన. ఈ మధ్య కొన్ని సినిమాలలో ఆయనని తప్పించారు అన్న ప్రచారం గురించి నేరుగా మాట్లాడిన బ్రాహ్మీ ” ఒక సినిమా కోసం నన్ను దర్శక నిర్మాతలు అడిగినప్పుడు నేను ఒద్దు అని చెప్పను, కానీ అనుకోకుండా ఏదైనా కారణాల వలన నేను చెయ్యలేకపోతే మాత్రం నా స్థానం లో వేరొకర్ని తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే అది తీసేయడం ఎలా అవుతుంది ? ఈ మధ్యన బాలకృష్ణ డిక్టేటర్ కోసం నన్ను అడిగారు నాకు కాల్షీట్ లు లేవు అందుకే ఆ సినిమా లో నేను లేను, దాన్ని తీసేయడం అనరు కదా ? ” అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు బ్రహ్మానందం.

కొత్త కమీడియన్ లు వచ్చినప్పుడు తనకి ఎదురు అయ్యే పోటీ గురించి మాట్లాడుతూ ” బాబూ మోహన్ ఫార్మ్ లో ఉన్నప్పుడు బ్రహ్మానందం చాప్టర్ క్లోజ్ అన్నారు, సుధాకర్ విషయం లో కూడా అదే జరిగింది. సునీల్ రావడం తో ఇంక నన్ను బట్టలు సర్డుకోమన్నారు ఇలా ఎవరు కొత్తవాళ్ళు వచ్చినా నన్ను టార్గెట్ చెయ్యడం మామూలే ” అని లైట్ గా చెప్పేస్తున్నాడు ఈ లెజెండ్రీ కమీడియన్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -