Sunday, May 5, 2024
- Advertisement -

జక్కన్న స్క్రిప్ట్…..మెగా కెలుకుడు షురూ…….ఆ విషయంలో ఎన్టీఆర్‌ని చరణ్ బీట్ చేయాలట

- Advertisement -

కథ విషయంలో ఇప్పటి వరకూ రాజమౌళి నుంచి వచ్చిన అద్భుతాలు ఏమీ లేవు. బాలీవుడ్ దర్శకుల విషయం పక్కన పెట్టినా శంకర్, మురుగదాస్‌లతో పాటు ‘గమ్యం’ డైరెక్టర్ క్రిష్‌ల స్థాయి కథలు ఎప్పుడూ రాజమౌళి నుంచి రాలేదు. కమర్షియల్స్‌కి బాగా ప్రాధాన్యతనిచ్చి మార్కెటింగ్‌తో కలెక్షన్స్ దుమ్ములేపే రాజమౌళి నుంచి ఆ స్థాయి సినిమాలను కూడా ఆశించలేం. అయితే ప్రాజెక్ట్ సెట్ చేసుకోవడం దగ్గర నుంచి….ఆ ప్రాజెక్ట్ భయంకరమైన పబ్లిసిటీ ఇవ్వడంలో మాత్రం ఇండియాలోనే బెస్ట్ డైరెక్టర్ రాజమౌళి అని చెప్పొచ్చు. డబ్బుల కోసం తీసిన ఒక కమర్షియల్ సినిమాను ప్రజల ఆత్మగౌరవంతోనూ, ఆత్మాభిమానంతోనూ ఐడింటిఫై చేసుకునేలా చేసి కలెక్షన్స్ కొల్లగొట్టడం అంటే మాటలా? అదీ రాజమౌళి పబ్లిసిటీీ తెలివితేటల స్థాయి. ఈ సారి కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో గేం ఛేంజర్…..అలాగే సొసైటీలో ఉన్న కులాల గొడవలకు చెక్ పెట్టేస్థాయి సినిమాగా ఎన్టీఆర్, చరణ్‌ల సినిమాను ప్రజెక్ట్ చేస్తున్నాడు రాజమౌళి. అయితే మగధీర నాటి ఇబ్బందులే మరోసారి జక్కన్నకు వస్తున్నాయని ఫిల్మ్ నగర్ వార్తలు అందుతున్నాయి.

డ్యాన్సులు, ఫైట్స్ విషయంలో ఎన్టీఆర్చ చరణ్‌ల మధ్య పెద్దగా అంతరం ఉండకపోవచ్చు కానీ యాక్టింగ్ విషయంలో మాత్రం ఎన్టీఆర్‌ యాక్టింగ్ స్టామినాతో పోల్చితే చరణ్ ఇంకా నేర్చుకునే దశలో ఉన్నట్టే. అందుకే ఇప్పుడు ఈ విషయంలో రాజమౌళికి మెగా కండిషన్స్ చెప్పారని తెలుస్తోంది. ఎన్టీఆర్‌లా నవరసాలు పండించడం చరణ్‌కి అసాధ్యం. అయితే కొన్ని ఎమోషన్స్‌ని మాత్రం చాలా బాగా చూపించగలడు. రచ్చ, నాయక్, ఎవడు లాంటి సినిమాల్లో చరణ్ యాక్టింగ్ బాగుంది అనిపించడానికి కారణం కూడా ఆయా సినిమా కథలు వేరైనా సీన్స్, చరణ్ క్యారెక్టర్ తాలూకూ ఎమోషన్స్ మాత్రం ఒకేలా ఉండడమే. ఇప్పుడు రాజమౌళి స్క్రిప్ట్‌లో చరణ్‌కి ఉండే సీన్స్ అన్నీ ఆ తరహాలో ఉండేలా చూడమని చెప్పారట. చరణ్‌ ఏ సీన్స్‌లో అయితే బాగా యాక్టింగ్ చేయగలడో….ఏ ఎమోషన్స్‌ని అద్భుతంగా పెర్ఫార్మ్ చేయగలడో వాటినే చేయడానికి స్కోప్ ఉండేలా చరణ్ సీన్స్, ట్రీట్‌మెంట్ ఉండాలని చెప్పారట. సాధారణంగా రాజమౌళి సినిమాల్లో కూడా ఆ ఎమోషన్సే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ రకమైన సీన్స్ ప్లాన్ చేయడానకి రాజమౌళి కూడా పెద్దగా ఇబ్బంది పడలేదట. స్క్రిప్ట్ దశలోనే మార్పులు చేర్పులకు గురవుతున్న ఈ భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ మూవీలో ముందు ముందు ఇంకెన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -