Wednesday, May 15, 2024
- Advertisement -

పవన్ పై కోపడుతున్నారు!

- Advertisement -

పవన్ తనకు అన్నయ్య చిరు అంటే ఎంత ఇష్టమో చాలా సందర్భంలో చెప్పిన విషయం తెలిసిందే. అలాగే చిరు కూడా తమ్ముడిపై తనకు ఎంత ప్రేమందో చాలాసర్లే చెప్పాడు. అయితే చిరు పవన్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూట్ జరుగుతున్న సమయంలో సెట్ కి వేళ్ళి మరి అక్కడ ఆ యూనిట్ సభ్యులతో సరదా గడిపి అల్ ది బెస్ట్ చెప్పి సర్దార్ ఆడియోకి వస్తా అని మాట ఇచ్చి తన మాటను నిలబెట్టుకున్నాడు.

కానీ పవన్ మాత్రం మెగా అభిమానులని భాద పెడుతున్నాడు. రీసెంట్ గా చిరు 150వ సినిమా గ్రాండ్ గా లాంచ్ అయింది. మెగా ఫ్యామీలికి సంబంధించి అందరు ఈ లాంచింగ్ లో పాల్గొన్నారు. కానీ పవన్ మాత్రం ఈ లాంచింగ్ కి రాలేదు. చిరు మాత్రం తమ్ముడి కోసం చాలా చేస్తున్నాడు కానీ పవన్ మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నాడు అని మెగా అభిమానులు పవన్ పై కోపడుతున్నారు.

నితిన్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వస్తున్న ‘అ….ఆ’ చిత్ర ఆడియో వేడుకకు పవన్ చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నాడు. దీంతో మెగా అభిమానులు త్రివిక్రమ్ నితిన్ ల కోసం వస్తున్నాడు కాని అన్నయ్య కోసం రాడా అని అంటున్నారు. అలాగే మెగా స్టార్ తన 150వ చిత్రం లాంచింగ్ విషయాన్నీ పది రోజుల ముందే అందరికి చెప్పాడట. కాని పవన్ మాత్రం ఎందుకు లాంచింగ్ కు హాజరు కావడానికి ప్లాన్ చేసుకోలేదు అని అడుగుతున్నారట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -