Sunday, May 19, 2024
- Advertisement -

కబాలి ఫస్ట్ టీజర్!

- Advertisement -

రజినీ సినిమా వస్తుందంటే ప్రపంచమొత్తం ఎపుడు చూద్దామా అని ఎదురు చూస్తుంది. అలాగే రజనీకి క్రేజ్ ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. అతని సినిమా ప్లాప్ అయిన తర్వాతి సినిమాపై భారీగా అంచనాలు వచ్చేస్తాయి. ‘విక్రమసింహా’ ఫ్లాప్ అయినా.. ‘లింగా’ సినిమాకు ఎంత క్రేజ్ వచ్చిందో తెలిసిందే.

‘లింగా’ కూడా ఫ్లాప్ అయినా సరే.. ఇప్పుడు ‘కబాలి’ మీద హైప్ తక్కువేమీ లేదు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైన నాటి నుంచి తమిళ-తెలుగు భాషలు రెండింట్లోనూ ఈ సినిమా మీద అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. తెల్లటి గడ్డంతోనూ తనైన స్టయిల్ చూపించి జనాల్ని ఆకర్షించాడు రజినీ. ఇప్పటిదాకా రిలీజ్ చేసిన పోస్టర్లన్నంట్టోకి ఇందులో రజినీ డీగ్లామరస్ గా కనిపిస్తున్నాడు. నెత్తిన ఉన్న విగ్గు మినహాయిస్తే దాదాపుగా ఒరిజినల్ గెటప్ లోనే కనిపిస్తున్నాడు రజినీ. అయినప్పటికీ ఆయన ఆకర్షణ మంత్రం మాత్రం మిస్సవ్వలేదు.

మే 1వ తేది సందర్భంగా ‘కబాలి’ ఫస్ట్ టీజర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ కు మంచి స్పందన వస్తుంది. అట్టకత్తి, మద్రాస్ లాంటి వైవిధ్యమైన సినిమాలు తీసిన యువ దర్శకుడు పా.రంజిత్ ఈ చిత్రానికి దర్శకుడు. ఆ రెండు సినిమాలు చూస్తే అతడి శైలికి.. రజినీ స్టయిల్‌కు చక్కగా కుదిరింది. రజినీ కుమార్తె సౌందర్య ఈ కాంబినేషన్‌ను తెరమీదికి తెచ్చింది. మరి టీజరే ఈ రెంజ్ లో ఉందటే మరి సినిమా ఏ రెంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ఈ చిత్రంలో రజినీ సరసన రాధిక అఫ్టే హీరోయిన్ గా నటించింది. జూన్ 3న ‘కబాలి’ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.

{youtube}v=9mdJV5-eias{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -