Tuesday, May 21, 2024
- Advertisement -

పోలీస్… పోలీస్… పోలీస్…

- Advertisement -

మెగా హీరోలందరు పోలీస్ పాత్రలపై ఇష్టం ఎక్కువ చూపిస్తున్నారు. మొన్న ఈ మధ్య రిలీజ్ అయిన సర్దర్ గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ పోలీస్ పాత్రలో నటించి మెగా అభిమానులను అలరించాడు. సినిమా కథ పరంగా పక్కన పెడితే పవన్ తన అభిమానులను పోలీస్ పాత్రలో అలరించడంలో ఫుల్ సక్సెస్ అయ్యాడు.

ఇక పవన్ అలరించినట్లే ఇప్పుడు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కూడా పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న సరైనోడు సినిమాలో బన్నీ పోలీస్ పాత్రలో చింపేశాడట. భారీ అంచనాలు ఉన్నా ఈ సినిమాని ఈ నెల 22న గ్రాండ్ గా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో బన్నీ సరసన రకుల్ మరియి క్యాథరిన్ లు హీరోయిన్స్ గా నటించగా థమన్ సంగీతం అందించాడు.

అలాగే మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా సుప్రిమ్ సినిమాలో పోలీస్ గెటప్ లో కనిపిస్తున్నాడు. సుప్రిమ్ ట్రైలర్ చూస్తే అందులో హీరోయిన్ తో ఫన్నీగా కొన్నీ సీన్స్ కనబడుతున్నాయి. మరి ఈ సినిమాలో ధరమ్ తేజ్ అసలు పోలీసా? కాదా?అనే విషయం తెలియాలి అంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే. ఏది ఏం అయిన మెగా హీరోలు పోలీస్ పాత్రలో కనిపించి మెగా అభిమానులను ఎంత వరకు అలరిస్తారో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -