Saturday, May 4, 2024
- Advertisement -

చిరుకి ఇష్టంలేకనే అలా చేస్తున్నాడా?

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు నాగబాబు కూతురు నిహారిక హీరోయిన్‍గా ఒక మనసు సినిమా ద్వారా పరిచయం అవుతుంది. అయితే చిరంజీవి మాత్రం ఒక మనసు సినిమాని ప్రమోట్ చేయడం లేదు. మొదటి నుండి కూడా మెగాస్టార్ నిహారిక సినిమాకు పెద్దగా ప్రోత్సాహం ఇవ్వడం లేదు. ఒక మనసు సినిమా ప్రారంభోత్సవానికి రాలేదు.

ఈ చిత్రం రిలీజ్ కు దగ్గరపడుతున్నా కూడా మెగా వాయిస్ ఎక్కడా వినిపించడం లేదు. మెగా ఫ్యామిలీ నుండి ఆడపిల్ల సినిమాల్లో నటించడం ఇష్టం లేకే ఆయన ఇలా చేస్తున్నాడనే టాక్ ఉంది. ఒక మనసు ఆడియో ఫంక్షన్ లో చరణ్, బన్నీ, వరుణ్, సాయి అంతా వచ్చారు. విషెస్ చెప్పారు. కానీ మెగాస్టార్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన రాకకోసం దర్శక నిర్మాతలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఇక నిహారిక కూడా తన పెదడాడీ వస్తాడని ఆశలు పెట్టుకున్నా అవి ఆవిరైపోయాయి. తమ ఇంటి ఆడకూతురు సినిమా హీరోయిన్ గా చేయడం ఇష్టం లేదనే వాదనతో పాటు, ఈ మూవీ వల్ల హీరోయిన్ కు ఏం పేరు వస్తుంది. హిట్ అయితే హీరోకే వస్తుంది. నిహారిక వల్ల కొంత మంది థియేటర్స్ వస్తారు. కానీ హిట్ అయితే హీరోకే క్రెడిట్ దక్కుతుంది. హీరోయిన్ కు ఏమీ ఉండదు. అందుకే పైగా సినిమా రిలీజ్ రోజున నాలుగు ముక్కలు చెబుదాం లే అని మెగాస్టార్ భావిస్తున్నాడట. ఏది ఏమైనా కమల్ హాసన్ తన కూతుళ్లను స్టార్ హీరోయిన్స్ ని చేశాడు. అంత స్వేచ్చ మెగా ఫ్యామిలీ ఇవ్వదని మాత్రం రుజువైంది. బహుషా నిహారికకు ఇదే ఆఖరు సినిమా అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మగవాళ్లకైతే ఎగురుకుంటూ వచ్చి ప్రమోట్ చేసే చిరు…ఆడ పిల్లను మాత్రం ఎంకరేజ్ చేయకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆయనకసలు నిహారిక సినిమాల్లో నటించడం ఏమాత్రం ఇష్టం లేదని టాక్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -