ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమా తో బిజీగా ఉన్నాడు. డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమా తర్వాత పవన్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రంకు సంబంధించిన కాస్టింగ్ పనుల్లో బిజీగా వున్నారు త్రివిక్రమ్. ఈ సినిమా కథ ప్రకారం హీరో పవన్ తర్వాత అంతే ప్రాధన్యత వున్న ఓ క్యారెక్టర్ ను డిజైన్ చేశారు త్రివిక్రమ్.
ఆ రోల్ కోసం ముందుగా కన్నడ స్టార్ హీరో ఉపేంద్రను అనుకున్నారు. అయితే గతంలో ఆయన త్రివిక్రమ్ సినిమా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ విషయంలో త్రివిక్రమ్ మనసు మరో స్టార్ పై మారిందని టాక్. ఆ పాత్రలో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ను తీసుకుంటే బాగుంటుందనే ఆలోచనలో త్రివిక్రమ్ వున్నారని తెలుస్తోంది.
మనమంతా’ .. ‘జనతా గ్యారేజ్’ .. ‘మన్యం పులి’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరైన మోహన్ లాల్.. ఈ పాత్రకు సరిగ్గా సరిపోతారని భావిస్తున్నారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఇక సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ సినిమాలో పవన్ కి మామగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలోనే ఓ క్లారిటీ రానుంది.
Related