Wednesday, May 15, 2024
- Advertisement -

బాలయ్యకు 100..మోక్షజ్ఞకు 1!

- Advertisement -

నందమూరి బాలకృష్ణ నటించిన డిక్టేటర్ సినిమా నందమూరి అభిమానులని అనందపరుస్తుంది. బాలయ్య అభిమానులకు నచ్చే అన్ని అంశాలు ఇందులో ఉండటంతో సినిమా మంచి పాజిటివ్ టాక్‍ దూసుకుపోతుంది. బాలయ్య సరసన అంజలి, సోనాల్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి శ్రీవాస్ దర్శకత్వం వహించాడు.

సంక్రాంతి పండగను చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో జరుపుకున్నారు బాలకృష్ణ. ప్రజలు అంతా బాగుండాలి, వారి పంటలు బాగా పండాలని బాలకృష్ణ ఆకాంక్షించారు. హిందుపురం అభివృద్ధికి కృషి చేస్తాను అని బాలయ్య తెలిపారు.

ఇక బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినిమాలోకి ఎపుడు వస్తాడు అనే విషయంపై స్పందించాడు. నేను నటించబోయే వందో సినిమాలో మా అబ్బాయి మోక్షజ్ఞ నటించవచ్చు అన్నట్లు తెలిపారు. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న నందమూరి అభిమానులకు ఇది ఒక శుభవార్తే అని చెప్పవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -