ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ (iBOMMA) నిర్వాహకుడు రవి కేసులో కొత్త పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే రవిపై 10 సెక్షన్లు నమోదు చేసిన పోలీసులు తాజాగా మరో మూడు సెక్షన్లను జోడించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 13కి చేరింది.
ముందుగా IT చట్టం, BNS సెక్షన్లు, సినిమాటోగ్రఫీ యాక్ట్, మరియు ఫారినర్స్ యాక్ట్ కింద 10 సెక్షన్లు నమోదు అయ్యాయి. తాజాగా, పోలీసులు ఫోర్జరీ సెక్షన్లను జోడించారు.
రవి, ప్రహ్లాద్ అనే వ్యక్తి పేరు మీద పాన్ కార్డ్, బైక్ లైసెన్స్, RC తీసుకున్నట్లు గుర్తించారు. దీనిపై ఫోర్జరీ సెక్షన్లను జోడిస్తూ పోలీసులు కోర్టులో మెమో ఫైల్ చేశారు.మరోవైపు, రాబోయే రెండు రోజుల్లో రవి నుంచి మరింత కీలక సమాచారం రాబట్టడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా, క్రిప్టో వ్యాలెట్ వివరాలు (Crypto Wallets), అలాగే రవితో సంబంధం ఉన్న విదేశీ భాగస్వాముల వివరాలపై పోలీసులు ప్రధానంగా ఆరా తీయనున్నారు.
