- Advertisement -

విశ్వసుందరిగా ఫాతిమా బోష్

- Advertisement -

మెక్సికోకు చెందిన ఫాతిమా బోష్ మిస్ యూనివర్స్ 2025 విజేతగా ఎంపికయ్యారు. అనేక వివాదాల నడుమ జరిగిన ఈ పోటీలో బోష్ విజయాన్ని అందుకున్నారు. బ్యాంకాక్‌లో శుక్రవారం ఉదయం (అమెరికాలో గురువారం రాత్రి) జరిగిన 74వ మిస్ యూనివర్స్ పోటీలో 25 ఏళ్ల ఫాతిమా బోష్ కిరీటం దక్కించుకున్నారు. డెన్మార్క్‌కు తొలి మిస్ యూనివర్స్ టైటిల్ తెచ్చిన 2024 విజేత విక్టోరియా క్యార్ థెయిల్విగ్ చేతుల మీదుగా బోష్ కిరీటం అందుకున్నారు.

ఈ సంవత్సరం పోటీ మొదలైనప్పటి నుంచి వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. నవంబర్ 4న జరిగిన ఓ స్పాన్సర్‌షిప్ ఈవెంట్‌లో మిస్ థాయ్‌లాండ్ డైరెక్టర్ నవాట్ ఇత్సరాగ్రిసిల్‌తో బోష్ వాగ్వాదానికి దిగిన విషయం లైవ్ స్ట్రీమ్ కావడంతో విపరీతంగా వైరల్ అయింది. ఈ ఘటనకు స్పందించిన మిస్ యూనివర్స్ అధ్యక్షుడు రౌల్ రోచా, ఇత్సరాగ్రిసిల్‌ను భవిష్యత్ పేజెంట్ ఈవెంట్‌లకు అనుమతించబోమని ప్రకటించారు. అయినప్పటికీ, ఆయన అనేక కార్యక్రమాల్లో హాజరయ్యారు.

ఫైనల్‌కు కొన్ని రోజుల ముందు పరిస్థితి మరింత సంక్లిష్టమైంది. కంపోజర్ ఒమర్ హార్ఫాచ్ జడ్జ్ పదవి నుండి వైదొలిగారు. సంస్థ ఇప్పటికే “సీక్రెట్ ఓటు” ద్వారా టాప్ 30ని నిర్ణయించిందని, ఇది అధికారిక జ్యూరీని పక్కన పెట్టినట్లు ఆరోపించారు. ఇక ఈ సంవత్సరం భారత్‌ తరపున 21 ఏళ్ల పొలిటికల్ సైన్స్ విద్యార్థిని మానికా విశ్వకర్మ పాల్గొనగా టాప్ 30లో చోటు దక్కించుకున్నారు. అయితే టాప్ 12లో మానికకు చోటు దక్కలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -