Friday, May 17, 2024
- Advertisement -

చిరు పేరుతోనే కాదు..! బాలయ్య పేరుతో కూడా సినిమా!

- Advertisement -

అప్పుడెప్పుడో టాలీవుడ్ లో ఒక సినిమా వచ్చింది ‘శీనుగాడు చిరంజీవి ఫ్యాన్’ అని. ఎవరో కొత్త కుర్రాడు ఆ సినిమాలో నటించాడు. సినిమాలో అతడు మెగాస్టార్ చిరంజీవి కి ఫ్యాన్ గా కనిపిస్తాడు. దీంతో టైటిల్ ను ‘శీనుగాడు చిరంజీవి ఫ్యాన్” అని పెట్టి సినిమాకు గుర్తింపు సంపాదించుకొన్నారు.

అది ఎంత హిట్ అయ్యిందో తెలీదు కానీ.. ఆ టైటిల్ తో ఒక గుర్తింపును అయితే సొంతం చేసుకొంది.

మరి అప్పట్లోనే చిరంజీవి పేరు మీద సినిమా రాగా.. ఇప్పుడు బాలకృష్ణ ఇమేజ్ ను వాడుకొంటూ కూడా ఒక సినిమా వస్తోంది. ఆ  సినిమా పేరు “బాలయ్య ఫ్యాన్’ విశేషం ఏమిటంటే.. ఇందులో హీరో నాని. హీరోగా సొంత ఇమేజ్ ను కలిగిన అతడు ‘బాలయ్య ఫ్యాన్’గా కనిపించబోతున్నాడు. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది!

మరి ఒక పేరున్న యువహీరో ఈ విధంగా స్టార్ హీరో అభిమానిగా కనిపించడం నిజంగా  విశేషమే. ఇదే ఈ సినిమాకు మంచి గుర్తింపు తెచ్చిపెడుతుంది. ఈ సినిమాను బాలయ్య అభిమానులు కూడా ఆసక్తిగా చూసే అవకాశం ఉంది. నానికి సహజంగా ఉన్న ఫాలోయింగ్ కు.. బాలయ్య ఫ్యాన్స్ కూడా తోడయితే ‘బాలయ్య ఫ్యాన్’ సినిమాకు తిరుగుండకపోవచ్చు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -