Sunday, April 28, 2024
- Advertisement -

నా సామిరంగ వంతు వచ్చేసింది?

- Advertisement -

సంక్రాంతి సినిమాలు రిలీజ్‌కు రెడీ అయిపోయాయి. ఇప్పటికే సంక్రాంతి రేసులో ఉన్న సినిమాల్లో ఒక్క సినిమా ప్రీ రిలీజ్ తప్ప అన్ని సినిమాల ఈవెంట్లు పూర్తయ్యాయి. సంక్రాంతి రేసులో వస్తున్న తొలి సినిమా గుంటూరు కారం, తేజ సజ్జ హనుమాన్. ఈ రెండు సినిమాలు జనవరి 12న రిలీజ్ కానుండగా వెంకటేష్ నటించిన సైంధవ్ జనవరి 13న, చివరగా కింగ్ నాగార్జున నటించిన నా సామిరంగ రిలీజ్ కానున్నాయి.

ఇప్పటికే ఈ నాలుగు సినిమాల ప్రమోషనల్ ఈవెంట్స్, ప్రెస్ మీట్స్ తో సందడి నెలకొనగా నిన్న గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. మహేష్‌ బాబుతో పాటు చిత్ర యూనిట్ అంతా పాల్గొనగా ఈ కార్యక్రమం గుంటూరులో జరిగింది. ఇప్పటికే హనుమాన్, సైంధవ్ ప్రీ రిలీజ్ వేడుక జరిగిన సంగతి తెలిసిందే. హనుమాన్ ప్రీ రిలీజ్‌కు అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రాగా సైంధవ్‌ సినిమాకు చిత్ర యూనిట్ అంతా హాజరై హైప్ పెంచేశారు.

తాజాగా ఇవాళ నా సామిరంగ ప్రీ రిలీజ్ వేడుక జరుగనుంది. హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్ లో సాయంత్రం 6 గంటల నుండి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండగా అక్కినేని ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తరలిరానున్నారు. ఇక ఇవాళ్టితో సంక్రాంతి సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలు ముగియనుండగా రేసులో విజేతగా ఎవరు నిలుస్తారో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -