అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు సీఎం జగన్. ఇప్పటికే రెండు దశల్లో అభ్యర్థులను మార్చగా తాజాగా మూడో లిస్టుపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు జగన్. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలతో సీఎం జగన్ ప్రత్యేకంగా భేటీ కాగా ఇవాళ ఉదయం తాడేపల్లి సీఎంఓకు ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ను వచ్చే ఎన్నికల్లో ఆలూరు నుండి కాకుండా కర్నూల్ ఎంపీగా పోటీ చేయించాలని జగన్ భవిస్తున్నారు. అయితే ఎంపీగా పోటీ చేసేందుకు జయరాం విముఖత చూపిస్తుండటంతో జగన్‌తో సమావేశం తర్వాత ఫుల్ క్లారిటీ రానుంది.
ఆలూరు నుండి విరూపాక్షిని బరిలో దించే ఆలోచనలో ఉన్నారు జగన్. అలాగే మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను అనకాపల్లి నుండి కాకుండా వేరే చోట నుండి పోటీ చేయించాలని జగన్ నిర్ణయం తీసుకోగా ఎక్కడి నుండి పోటీ చేయాలనే దానిపై గుడివాడ అమర్ నాథ్ కు పార్టీ నాయకత్వం స్పష్టత ఇవ్వనుంది.
విజయవాడ సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్థానంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు కేటాయించగా ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేస్తోంది వైసీపీ అధిష్టానం. ఇక ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వై నాట్ 175 లక్ష్యంతో పావులు కదుపుతున్న జగన్ గెలుపు గుర్రాలను బరిలోకి దించుతున్నారు. ఈ క్రమంలోనే తొలి విడతలో 11 అసెంబ్లీ స్థానాల్లో ఇంచార్జీలను మార్చగా రెండో విడతలో 27 మంది ఇంచార్జీలను మార్చారు. ఇక మూడో జాబితా ఇవాళో,రేపో విడుదల కానుంది.
