Sunday, May 5, 2024
- Advertisement -

ప్రభాస్ పాట చైతూ కి టైటిల్

- Advertisement -

పాటల్లోని మొదటి పదాలు తీసుకుని వాటిని సినిమా పేర్లు గా పెట్టేయ్యడం తెలుగు సినిమాలో కొత్తేమీ కాదు. టైటిల్స్ లేక మొదట్లో అలా జరిగితే ఇప్పుడు టైటిల్స్ ఉన్నా కూడా అదే విధంగా సాగుతోంది పంథా . నాగ చైతన్య మొన్ననే ఒక్కడు లోని సాహసం శ్వాసగా సాగిపో పాట ని సినిమాకి పేరు గా పెట్టేసుకున్నాడు ఇప్పుడు మళ్ళీ తన కొత్త సినిమాకి అలాంటి ప్రయోగమే చేస్తున్నాడు అని తెలుస్తోంది.

రమేష్ వర్మ తో నాగ చైతన్య ఎప్పటి నుంచో ఒక సినిమా చెయ్యాల్సి ఉంది. ఆ సినిమా తెరకి ఎక్కించడం కోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు సాగుతూ ఉనాయి. ఒక ప్రేమ కథగా దీన్ని చెబుతున్నారు దీనికోసం ప్రభాస్ మిర్చి సినిమా లోని ” ఇదేదో బాగుందే చెలి ” అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.

రమేష్ వర్మ ఈ మధ్యనే నాగ సౌర్య తో ఒక సినిమా చేసాడు అది ఫయిల్ అవ్వడం తో నాగ చైతన్య కి ఒక స్టోరీ లైన్ చెప్పగా అది చైతూ కి బాగా నచ్చేసింది. దీంతో గత సినిమాలు ప్లాప్ అయినా ఓకే  చెప్పేసాడు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -