స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని ఇంట కోడలిగా అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది. గోవాలో అక్టోబర్ 6నే చైతూ సమంతల పెళ్లి జరగనుండటంతో.. అందుకు ఏర్పాట్లు రెడీ అయ్యాయి. అందులో భాగంగానే అక్కినేని ఫ్యామిలీ డబ్ల్యూ రిసార్ట్స్ లో జరగనున్న ఈ పెళ్లి కోసం ఆల్రెడీ రిసార్ట్స్ కు కూడా చేరుకున్నారని సమాచారం. ఇక పెళ్లి అయ్యేవరకు వారాంతా అక్కడే ఉంటారట. ఈ క్రమంలో అక్టోబర్ 6న హిందూ సంప్రదాయం ప్రకారం.. ఆ తర్వాత అక్టోబర్ 7న క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి జరుగుతుందని తెలుస్తోది.
ఇక పెళ్లి మాత్రం సింపుల్ గా జరపనున్నారట. అయితే, స్టార్ సెలబ్రిటీల పెళ్లి ఎంత సింపుల్ గా అనుకున్నా కూడా అది బడ్జెట్ పరంగా పెద్ద నెంబర్ నే టచ్ చేస్తుందని వేరే చెప్పక్కర్లేదు. కానీ, ఆ బడ్జెట్ మనకు షాకింగ్ గా అనిపించినా, అది వాళ్లకు మాత్రం సింపుల్ గా జరిగిన పెళ్లికి అయ్యే ఖర్చు కిందే లెక్క. ఈ పెళ్లి కోసం చైతూ సమంతలు ఏకంగా 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారట. అదేంటి పెళ్లి చాలా సింపుల్ గా చేసుకుంటామని చెప్పారు కదా అనుకోవచ్చు.. ఇప్పుడు కూడా చైతూ సమంతలు అదే మాట చెబుతున్నారు. అంతేకాకుండా పెళ్ళికి కేవలం 150 మంది అతిథుల్ని మాత్రమే పిలుస్తున్నామని.. ఎంపిక చేసుకున్న సన్నిహితుల మధ్య ఈ పెళ్లి వేడుక సింపుల్ గా జరగనుందని చైతూ సమంతలు చెప్తున్నారు. మరి అలాంటప్పుడు అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఎందుకనే డౌట్ రావొచ్చు.
అందుకే ఆ బడ్జెట్ వివరాలు కూడా ఇప్పుడు బయటకు లీక్ చేశారు. అదేంటంటే, పెళ్లికి వచ్చి వెళ్లే వారికి విమాన ఖర్చులు మొదలుపెట్టి అన్ని రకాల ఖర్చులను ఇప్పుడు చైతూ సమంతలే భరిస్తారట. దీంతో ఈ సింపుల్ పెళ్లికి సింపుల్ గా 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నట్లు లెక్క తేలిందట. ఎంతైనా బడా స్టార్స్ కదా.. ఆ మాత్రం లెక్క ఉంటుంది మరి. ఇకపోతే, ఇప్పుడు ఈ పెళ్ళికి వెళ్లే ఆ కొద్దిమంది స్టార్స్ లిస్టులో.. రామ్ చరణ్ దంపతులు, రాహుల్ రవీంద్ర ఫ్యామిలీ, నీరజ కోన మొదలగు స్టార్ ఫ్రెండ్స్ మాత్రమే హాజరు కానున్నారట. ఇక దగ్గుబాటి ఫ్యామిలీ, విక్టరీ వెంకటేష్, రానా లాంటి వాళ్ళు ఎలాగూ అక్కడ సందడి చేయనున్నారు. ఇక మిగిలిన వాళ్ళు తర్వాత భారీ ఎత్తున జరగనున్న రిసెప్షన్ లో సందడి చేయనున్నారు.