Saturday, April 27, 2024
- Advertisement -

నాగ్ బాటలోనే..చైతూ ‘మళ్లి పెళ్లి’!

- Advertisement -

తండ్రి నాగార్జున బాటలోనే నడుస్తున్నారు నాగ చైతన్య. కింగ్ నాగార్జున..అమలను రెండో వివాహం చేసుకోగా ఇప్పుడు చైతూ కూడా రెండో పెళ్లికి రెడీ అయ్యారు.చైతూకు జోడీ అయిన అమ్మాయిని నాగార్జున స్వయంగా సెలక్ట్ చేశాడని తెలుస్తోంది. ఆ అమ్మాయి నాగార్జున బంధువుల అమ్మాయేనని సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రానుండగా అన్ని పనులను నాగార్జున స్వయంగా దగ్గరుండి చూసుకుంటున్నారని తెలుస్తోంది.

వాస్తవానికి సమంతతో విడాకుల తర్వాత ఓ హీరోయిన్‌తో చైతూ డేటింగ్‌లో ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత అవన్ని రూమర్లేనని తేలిపోయింది.ఇక ప్రస్తుతం చైతూ వివాహానికి సంబంధించిన వార్త మళ్లీ తెరపైకి రావడంతో ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

2017లో నాగచైతన్య – సమంత వివాహాం గ్రాండ్‌గా జరిగింది. ఏం మాయ చేశావే సినిమాతో ప్రేమలో పడ్డ ఈ ఇద్దరు తర్వాత మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అయితే తర్వాత మనస్సర్ధలతో విడిపోయారు. ఎవరి కెరీర్‌లో వారు బిజీగా ఉండగా సమంత అనారోగ్య కారణాలతో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -