Saturday, May 11, 2024
- Advertisement -

చిరు, పవన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన నాగబాబు

- Advertisement -

మెగా ఫ్యామిలీలో నాగాబాబు కొంచెం ఘాటుగా మాట్లాడుతారన్న విషయం తెలిసిందే. ఆరెంజ్ సినిమాని నిర్మించిన నాగబాబుకి ఆశించిన లాభాం రాకపోగా.. నష్టం వచ్చింది. ఆ టైంలో పవన్ కళ్యాణ్, చిరంజీవి సపోర్ట్ చేశారు. ఈ విషయంను స్వయంగా నాగబాబే చెప్పారు.

మెగా ఫ్యామిలీ లో ఏ ఫంక్షన్ జరిగిన పవన్ హాజరుకారు అని నాగబాబు సభాముఖంగా చెప్పేశారు. మొన్న జరిగిన పవన్ బర్తడే రోజు చిరు తన భార్యతో కలిసి పవన్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు.. దీనిబట్టి వాళ్ళ బంధం మధ్య ఏలాంటి బేధాలు లేవని నిరూపించారు. రీసెంట్ గా నాగబాబు పవన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషాయాలు చెప్పారు. రాబోయే ఎన్నికల్లో అందరూ టీడీపి, వైసీపి గురించే మాట్లాడుతున్నారని పవన్ వస్తే పరిస్థితి మారుతుందని చెబుతున్నారు. మెగాస్టార్ ని కేవలం సినిమాల పరంగా అభిమానించే వారు ఉంటే.. పవన్ మాత్రం వ్యక్రిత్వాన్ని బట్టి అభిమానించే వారు ఎక్కువ మంది ఉన్నారట. దీన్ని బట్టి చూస్తే.. చిరంజీవి కంటే ఎక్కువ మంది అభిమానులు పవన్ కళ్యాణ్ కే ఉన్నారట.

అందుకే పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేస్తే, మిగిలిన పార్టీలను మించి సీట్లు సాధిస్తాడని తమ్ముణ్ని వెనకేసుకొచ్చాడు నాగబాబు. దీనిపై కొందరు నాగబాబు చెప్పింది కరెక్టే గాని ఇతరులను పోల్చి చెప్పడం తగదని అంటున్నారు. సొంత వాళ్ల మీద ఏం చెప్పుకున్న పర్వాలేదు కానీ సమాజంలో పేరు ప్రఖ్యాతలతో ఉన్న పెద్దవాళ్ళతో పోల్చి నవ్వుల పాలు కావద్దని విమర్శకులు అంటున్నారు. మెగాస్టార్ లేకుంటే.. ఈ రోజు మెగా ఫ్యామిలీ అనే పదం కూడా లేదని హెచ్చరిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -