Monday, May 20, 2024
- Advertisement -

రోబో 2.0 కథ లీక్.. చూస్తే వావ్ అంటారు

- Advertisement -

స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్.. సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా రోబో 2.0. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని దేశవ్యాప్తంగా రజనీ అభిమానులు ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నారు. 2010లో వ‌చ్చిన రోబో క్రియేట్ చేసిన సంచనాలు ఎన్నో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

అలాంటి హిట్ సినిమాకు సీక్వెల్‌గా వస్తుండటంతో.. ఈ 2.0 పై భారీ అంచనాలు ఉన్నాయి. శంకర్ సినిమాలంటే.. సినిమా వచ్చే వరకు ఒక్క ఫోటో కూడా లీక్ కాదు. అయితే ఇప్పుడు రోబో 2.0 కథ గురించి చిన్న‌లైన్ బ‌య‌ట‌కు లీక్ కాకుండా ద‌ర్శ‌కుడు శంక‌ర్ జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. అయితే 2.0 స్టోరీ ఇదేనంటూ చెన్నై స‌ర్కిల్స్‌లో ఓ కథ ప్రచారం జరుగుతోంది. ఈ క‌థ చాలా ఆస‌క్తిగా ఉంది…దీనిని తెర‌మీద చూస్తే మైండ్ బ్లోయింగ్ అయిపోవ‌డం ఖాయంగా కనిపిస్తోంది. అక్క‌డ ట్రెండ్ అవుతోన్న క‌థ ప్ర‌కారం.. ఓ వ్యక్తి (అక్షయ్‌కుమార్‌)కి పిచ్చి ప్రేమ. ప్ర‌పంచంలో ఎన్నో ర‌కాల అరుదైన ప‌క్షుల‌ను అత‌డు ప్రేమ‌తో పెంచుకుంటూ ఉంటాడు. అయితే అత‌డు పెంచుకుంటున్న ప‌క్షుల‌న్ని చ‌నిపోతూ ఉంటాయి. దీనిపై అత‌డు ఆరా తీస్తే ప్ర‌పంచంలో పెరుగుతోన్న టెక్నాల‌జీ ఎఫెక్ట్‌తో చాలా ప‌క్షిజాతులు అంత‌రించిపోతున్నాయ‌ని అత‌డికి తెలుస్తుంది. దీంతో అత‌డు టెక్నాల‌జీపై కోపం పెంచుకుంటాడు.

ప్ర‌పంచంలో ఉన్న సైంటిస్టుల‌ను, టెక్నాల‌జీని నాశ‌నం చేయాల‌ని అత‌డు భావిస్తాడు. ఇదిలా ఉంటే సైంటిస్ట్ అయిన (ర‌జనీకాంత్‌) అవినీతిని అంతం చేసేందుకు ఓ రోబోను క‌నిపెడ‌తాడు. ఆ సైంటిస్ట్‌, అత‌డు కనిపెట్టిన రోబో, ఆ పక్షి ప్రేమికుడు… ప్రధానంగా ఈ మూడు పాత్రల చుట్టూ ‘2.0’ కథ ఉంటుందని సమాచారం. స్టోరీ చూస్తుంటేనే సినిమాలో విజువ‌ల్స్ అదిరిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. మరి ఇదే కథ అసలు కథ అని చెప్పలేం.. అసలు కథ ఏంటో తెలియాలంటే.. సినిమా వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -