Tuesday, May 14, 2024
- Advertisement -

నాని సినిమాలో డాన్‌గా నాగార్జున‌

- Advertisement -

ఇద్ద‌రు సూప‌ర్‌హిట్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. వారిద్ద‌రూ క‌లిసి ఓ సినిమాలో మెరుస్తున్నారు. ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య నాగార్జున, నాని ప్ర‌ధాన ఇతివృత్తాల‌తో ఓ మ‌ల్టీస్టార‌ర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి రోజుకో విష‌యం బ‌య‌ట‌కు వ‌స్తోంది. ఈ సినిమాలో నాని, నాగ్ పాత్రలు విష‌యాలు బయటకొచ్చాయి. నాగార్జున మాఫియా డాన్ పాత్రలో కనిపిస్తాడట. అదే టైమ్‌లో నాని ఓ వైద్యుడిగా కనిపించనున్నాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

భలే మంచి రోజు, శమంతకమణి సినిమాలు తీసిన ఈ ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య ఈ మల్టీస్టారర్‌ను ప్ర‌త్యేకంగా తెర‌కెక్కిస్తారంట‌. నాని, నాగార్జున మధ్య కామెడీ సీన్స్ ఉన్నాయ‌ని స‌మాచారం. ఈ కామెడీ ఎలిమెంట్స్ వల్లనే ఈ ఇద్దరు హీరోలు ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. నాని సినిమాల్లో కామెడీ ఎక్కువ‌గా ఉంటుంది. అశ్వనీదత్ నిర్మాణంలో ఈ సినిమా వ‌స్తోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -