Wednesday, May 8, 2024
- Advertisement -

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో మునిమ‌న‌వ‌డు

- Advertisement -

క‌ల్యాణ్‌రామ్ కుమారుడు చిన్న‌నాటి ఎన్టీఆర్ పాత్ర‌లో

తేజ ద‌ర్శ‌క‌త్వంలో సీనియ‌ర్ ఎన్టీఆర్ బయోపిక్ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను బాల‌కృష్ణ న‌టిస్తూ స్వ‌యంగా నిర్మిస్తున్నాడు కూడా. అయితే ఈ సినిమా ఇటీవ‌ల షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఎన్టీఆర్ జ‌యంతి (జ‌న‌వ‌రి 18వ తేదీ) సంద‌ర్భంగా ఈ సినిమా టీజర్ విడుద‌ల చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు. ఈ సంద‌ర్భంగా కేవ‌లం టీజ‌ర్ కోసమే షూటింగ్ చేస్తున్నారు. అయితే ఈ బ‌యోపిక్‌లో ఎన్టీఆర్ చిన్న‌నాటి పాత్ర‌లో ఆ సీనియ‌ర్ న‌టుడు ముని మ‌న‌వ‌డు మెర‌వ‌నున్నాడు. స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత కథలో ఎన్టీఆర్ బాలుడిగా ఉన్న పాత్ర‌లో క‌ల్యాణ్‌రామ్ కుమారుడు క‌నిపించ‌నున్నాడు.

ఎన్టీఆర్ ఫ్యామిలీకి చెందిన బాలుడు కల్యాణ్ రామ్ అబ్బాయి శౌర్య రామ్‌ను తీసుకున్నార‌ట‌. షూటింగ్ కూడా మొద‌లుపెట్టేస్తున్నారు. శౌర్య రామ్ ఇంత‌కు ముందే త‌న తండ్రి న‌టించిన ఇజం సినిమాలో క‌ల్యాణ్‌రామ్ చిన్ననాటి పాత్రలో క‌నిపించాడు. శౌర్య‌రామ్‌కు ఇది రెండో సినిమా.

అయితే నంద‌మూరి వార‌సులంద‌రూ చిన్న‌ప్పుడు బాల‌న‌టులుగా మెరిసిన‌వారే. బాల‌కృష్ణ‌, ఎన్టీఆర్‌, కల్యాణ్ రామ్ బాల‌న‌టులుగా న‌టించారు. 1989లో బాలకృష్ణ హీరోగా వచ్చిన సూపర్ హిట్ సినిమా బాలగోపాలుడులో క‌ల్యాణ్‌రామ్ నటించాడు. ఇప్పుడు తన కొడుకు అదే బాలయ్య సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పాత్ర వేస్తున్నారు. శౌర్య చిన్నప్పటి ఎన్టీఆర్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ప్ర‌స్తుతం బాల‌కృష్ణ జైసింహా సినిమాతో సంక్రాంతి పండుగ‌కు వ‌స్తున్నాడు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -