Saturday, May 25, 2024
- Advertisement -

హవ్వ : కొడుకుతో కూడా వ్యాపారం చేస్తున్న నాగార్జున ..

- Advertisement -

మూడంటే మూడు రోజుల్లో తెలుగు సినిమా లెక్కలు తేల్చడం కోసం రంగంలోకి వస్తున్నాడు హీరో అక్కినేని అఖిల్ . అక్కినేని కందాన్ నుంచి వస్తున్న కొత్త వారసుడి మీద అక్కినేని ఫాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులకి కూడా చాలా స్పెషల్ ఫీలింగ్ ఉంది.

ఇండస్ట్రీ లో ప్రస్తుతం ఒక్కటంటే ఒక్క సినిమా కూడా అఖిల్ కి పోటీగా విడుదల చేసే సాహసం చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడం చూస్తుంటే అఖిల్ కోసం నాగార్జున చాలా జాగ్రత్తలు చేసారు అని అర్ధం అవుతోంది. ఈ సమయం లో రావాల్సిన బెంగాల్ టైగర్, శంకరాభరణం సినిమాలు కూడా వాయిదా వేయించారు నాగార్జున వీటితో పాటు కమల్ సినిమా చీకటి రాజ్యం కూడా పూర్తిగా పక్కకి నెట్టడం లో తన మానేజ్మెంట్ స్కిల్స్ మరొక్కసారి నిరూపించారు . అఖిల్ సినిమాని ప్రొడ్యూసర్ లు మాత్రమే కాకుండా తానూ క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు నాగ్.ప్రస్తుతం నాగ్ సోగ్గాడే చిన్ని నాయన మూవీలో నటిస్తున్నాడు. కళ్యాణ్ కృష్ణ అనే కొత్త డైరెక్టర్ తీస్తున్న ఈ సినిమా.. డిసెంబర్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్ ని అఖిల్ సినిమాల్లో వేయించి తన సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ కొట్టేయాలి అని నాగార్జున సన్నాహాలు చేస్తున్నారు. మొదటి రెండు వారాలూ అఖిల్ సినిమా ప్లే అయ్యే ప్రతీ థియేటర్ లో నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన టీజర్ కూడా ప్లే అవుతుంది అన్నమాట. ఇదే కదూ నాగార్జున ని తెలివిగల బిజినెస్ మ్యాన్ గా మార్చింది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -