Sunday, April 28, 2024
- Advertisement -

గట్టెక్కిన నాగార్జున..నా సామిరంగ!

- Advertisement -

విజయ్ బిన్ని దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన చిత్రం నా సామిరంగ. సంక్రాంతి రేసులో జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎంఎం కీరవాణి సంగీతం అందించగా ఆషిక రంగనాథ్ , అల్లరి నరేష్, రాజ్ తరుణ్, రుక్సర్ ధిల్లాన్, మిర్నా మీనన్ కీలక పాత్రలు పోషించారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇక సంక్రాంతి రేసులో వచ్చిన నాగార్జున సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయారు. మూడో రోజు నైజాంలో రూ. 1.05 కోట్లు,సీడెడ్ రూ. 60 లక్షలు,వైజాగ్ రూ.51 లక్షలు,తూర్పు గోదావరిలో రూ. 44 లక్షలు,వెస్ట్ గోదావరిలో రూ. 22 లక్షలు,కృష్ణలో రూ.24 లక్షలు,గుంటూరులో రూ. 34 లక్షలు,నెల్లూరులో రూ. 18 లక్షలు రాబట్టింది.

మొత్తం మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 12.46 కోట్ల షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ రూ.24.8 కోట్ల షేర్ అందుకొని బ్రేక్ ఈవెన్ దిశగా వెళ్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -