Sunday, April 28, 2024
- Advertisement -

విజయ్ దేవరకొండ..VD12 అప్‌డేట్!

- Advertisement -

ఖుషి సినిమాతో సక్సెస్ బాట పట్టారు హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో వరుస సినిమాలకు కమిట్ అయ్యారు విజయ్. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తుండగా ఇది త్వరలోనే పూర్తికానుంది. విజయ్ సరసన మృణాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేయనున్నారు విజయ్. ఈ సినిమా ఆగిపోయిందని ప్రచారం జరిగిన ఫ్యామిలీ స్టార్ పూర్తి అయిన తర్వాత VD12 షూటింగ్ మొదలు పెట్టనున్నారు విజయ్. భారీ బడ్జెట్తో రూపొందుతున్న తెరకెక్కుతున్న ఈ స్పై థ్రిల్లర్‌ లో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. అనిరుథ్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ని నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -