Saturday, April 27, 2024
- Advertisement -

బాలీవుడ్ రామాయణంలో నవీన్!

- Advertisement -

రామాయణం ఆధారంగా ఇప్పటికే వెండితెరపై ఎన్ని సినిమాలు వచ్చాయి..అలరించాయి. ఇక తాజాగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితేశ్ తివారి సైతం రామాయణంపై సినిమా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. రాముడిగా రణ్‌బీర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా కన్నడ స్టార్ యష్ ఫైనల్ అయ్యారు.

ఇక రామాయణంలో లక్ష్మణుడి పాత్ర కీలకం కాగా ఈ పాత్ర కోసం టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీనిపై నవీన్‌ను సంప్రదించగా ఆయన ఓకే చెప్పినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అఫిషియల్ ప్రకటన రానుంది.

వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుండగా మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నరని సమాచారం. అలాగే రామాయణంలోని మిగితా పాత్రలకు పలువురు బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -