ముచ్చట గా మూడో వాడు.

 

Nayantara’s Love Relationship With Young Director Vignesh Shivan

సీనియర్ హీరోయిన్లలో నయనతారకు మంచి పేరుంది.. ఇటు తెలుగు అటు తమిళ భాషల్లో వరస సినిమాలు చేస్తూ మంచి పొజిషనల్ ఉంది. నయన్ కెరియర్ బాగా ఉన్నా.. ప్రేమలో మాత్రం పడుతూ లేస్తూ ఉంది. తొలినాళ్లలో శింబుతో పీకల లోతు ప్రేమలో మునిగి కొన్నాళ్లు హల్ చల్ చేసింది. తరువాత ఏం జరిగిందో తెలియదు కానీ.. ఇద్దరూ విడిపోయారు.

తరువాత పైళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్, హీరో ప్రభుదేవతో లవ్ ట్రాక్ నడిపింది. మళ్లీ షరా మామూలే వీరిద్దరి ప్రేమకు కూడా బ్రేక్ లు పడ్డాయి.

మరి నయన్ కు మనం చిన్నప్పటి  ’ముచ్చటగా మూడు’ గుర్తొచ్చిందేమో వెంటనే మూడోవాడితో మూడ్ లోకి వెళ్లింది.  తాజాగా దర్శకుడు విఘ్నోష్ తో లవ్ లో పడింది. వీరిద్దరూ కలసి జాలీగా ట్రిప్ వేస్తున్నారు. మరి ఇదన్నా.. నిలుస్తుందా..? లేదో..? వేచి చూడాల్సిందే.