Thursday, April 25, 2024
- Advertisement -

ఆ హీరోయిన్ నిర్ణయం కారణంగా ప్యాకప్ చెప్పిన నాని..!

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఉన్న నాని ఇదివరకే “టక్ జగదీష్”చిత్రంలో నటించారు.ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలోనే నాని హీరోగా వివేక్‌ ఆత్రేయ తెరకెక్కిస్తోన్న ‘అంటే సుందరానికీ’ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో నానికి జోడిగా నజ్రియా నటిస్తోంది.

నజ్రియా నాజిమ్, ఫాహద్ ఫాజిల్ జోడీకి సినీ ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఫాహద్ పుష్ప సినిమాలో విలన్ గా చేస్తున్నారు. నజ్రియా,నాని “అంటే సుందరానికి” లో హీరోయిన్ పాత్రలో చేస్తున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా జాగ్రత్తలను పాటిస్తూ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో కరోనా కేసులు అధికంగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగులో పాల్గొనలేనని హీరోయిన్ తెగేసి చెప్పడంతో చేసేదేమీలేక చిత్ర బృందం మొత్తం ఈ సినిమాకు ప్యాకప్ చెబుతూ కొన్ని రోజులపాటు షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్నారని సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -