Wednesday, May 15, 2024
- Advertisement -

రకరకాల ప్లాన్స్ వేస్తున్నారట ప్రభాస్ టీం!

- Advertisement -

బాహుబలి సినిమాతో ప్రభాస్ కు తెలుగుతో పాటు అన్ని భాషలో మంచి క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం ప్రతి ఒక్కరు బాహుబలి 2 కోసం ఎదురు చూస్తున్నారు. ఇటివలే ఈ సినిమాకి జాతీయ అవార్డ్ కూడా వచ్చిన విషయం తెలిసిందే. రెండేళ్ళ కష్టం బాహుబలి రూపంలో భారీ విజయాన్ని అందించింది.

అందుకే బాహుబలి పార్ట్ 2 తో గొప్ప ఎత్తులే వేస్తున్నాడు ప్రభాస్. బాహుబలి రిలీజ్ కు ముందు సరైన ప్లానింగ్ చేయడం వల్ల ప్రభాస్ కు నేషనల్ లెవల్లో ఇమేజ్ ఏర్పడింది ,దాంతో బాహుబలి పార్ట్ 2 కి మరింతగా దృష్టి పెడితే తప్పకుండా సౌత్ లోనే కాకుండా మొత్తం దేశ వ్యాప్తంగా అలాగే ఓవర్సీస్ లో కూడా తిరుగులేని మార్కెట్ ఏర్పడుతుందని భావిస్తున్నారట ప్రభాస్.

అందుకనుగుణంగా ఇప్పటి నుండే రకరకాల ప్లాన్స్ వేస్తున్నారట ప్రభాస్ టీం. తెలుగు,తమిళ ,హిందీ మార్కెట్ లపై కన్నేశాడు ప్రభాస్. ఇప్పుడు పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం పొందాలంటే బాహుబలి ఇమేజ్ ని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడట ప్రభాస్. ఇక బాహుబలి 2 తర్వాత ప్రభాస్ రన్ రాజా రన్ సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చెయనున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -