Thursday, May 16, 2024
- Advertisement -

ప్రభాస్‌తో పెళ్లి గురించి నిహారిక రియాక్షన్ ఏంటంటే ?

- Advertisement -

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక.. ప్రభాస్‌తో ప్రేమాయణం సాగిస్తోందంటూ గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా నిహారిక ఈ వ్యవహారంపై షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే.. నిహారిక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుంది.

కొద్ది రోజులుగా మెగా డాటర్ హాట్ హాట్ ఫొటోలు, వీడియోలతో రచ్చ రచ్చ చేస్తోంది. దీంతో ఆమె గ్లామర్ పాత్రలు చేయడానికి రెడీ అవుతోందని అనుకున్నారు. తాజాగా ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని కన్ఫార్మ్ చేసిందామె. ‘ప్రభాస్‌ను ప్రేమ పెళ్లి చేసుకోబోతున్నారా అక్క’ అని ఒకరు నిహారికను ప్రశ్నించారు. దానికి ‘నేను ప్రభాస్‌ను పెళ్లి చేసుకోవడం ఏంటండి.? ఆయనెక్కడ.? నేనెక్కడ.?’ అంటూ షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది నిహారిక.

అలాగే, తన ఫ్యామిలీలో వరుణ్ కాకుండా చరణ్ అంటేనే బాగా ఇష్టమని చెప్పింది. అలాగే, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ చాలా క్లోజ్‌గా ఉంటారని తెలిపింది. ఆడవాళ్లలో శ్రీజ బెస్ట్ ఫ్రెండ్ అని, స్నేహారెడ్డి కూడా కలిసిపోతుందని వెల్లడించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -