Monday, April 29, 2024
- Advertisement -

సర్దార్ నెగిటివ్ కామెంట్స్‌పై ఘాటుగా స్పందించిన నిహారిక?

- Advertisement -

ఉగది కానుకగా భారీ ఎత్తున ఏప్రిల్ 8వ తేదిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ఐతే ఈ సినిమా మొదటి షో నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. రివ్వూలు కూడా ఈ సినిమాకి బిలో యావరేజ్ రేటింగే ఇచ్చారు. ఇక సోషల్ మీడియాలోనూ ఈ మూవీ బాగోలేదంటూ నెగిటివ్ న్యూస్ హల్ చల్ చేస్తున్నాయి.

ఇలా ఈ సినిమాపై వ్యతిరేకమైన వార్తలు వస్తున్నాయి. ఐతే ఈ వార్తలపై నాగబాబు తనయ మెగా హీఓయిన్ నిహారిక ఘాటుగా స్పందించిందట. ఈ వార్తే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మరింది. అయితే ఇటివలే నిహారిక తన ఫ్రేండ్స్ తో కలిసి సర్దార్ సినిమా చూసిందట. ఈ సినిమా చూసిన నిహారిక ఆమె ఫ్రేండ్స్ తెగ ఎంజాయ్ చేసారట. ముఖ్యంగా ఎంటర్‍టైన్‍మెంట్స్ సీన్స్ కి వారంతా ఫిదా అయ్యారట.

సో సర్దార్ సినిమా బాగానే ఉందని వారంతా చర్చించుకున్నట్లు తెలుస్తుంది. దీంతో.. సినిమా బాగున్నప్పటికి నెగిటివ్ ప్రచారం చేయడంపై నిహారిక మండిపడుతుందట. అలాగే ఈ సినిమాకి తక్కువ రేటింగ్ ఇచ్చిన రివ్యూవర్ల మీద ఈ మెగా హీరోయిన్ ఆగ్రహాం వ్యక్తం చేసిందని అనుకుంటున్నారు. సో ఎంతైన బాబాయ్ సినిమా కాబట్టి అమ్మాయికి ఆ మాత్రం ఆగ్రహం రావడం తప్పులేదని అనుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -