Wednesday, May 15, 2024
- Advertisement -

నిహారిక ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?

- Advertisement -

మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు ఇప్పటికే ఆరడజను మంది పైగా వచ్చారు. చిరు వేసిన బాటలో వీళ్లు హ్యాపీగా ప్రయణిస్తున్నారు. అయితే మాములుగా సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోల ఫ్యామిలీల నుంచి వారి అమ్మాయిలు సినిమా పరిశ్రమవైపు రారు. కానీ నాగబాబు కుమార్తె నిహారిక హీరోయిన్ గా రెండు మూడు సినిమాలు చేసింది. కానీ అవేవి ఆమెను హీరోయిన్ గా క్రేజ్ తెచ్చిపెట్టలేకపోయాయి.

అందుకే మెగా హీరోలకి చెందిన సినిమాల్లో ముఖ్యమైన పాత్రల్లో కనిపించడానికి ఎక్కువ ఉత్సాహాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలోనే చిరంజీవి చారిత్రక చిత్రమైన ‘సైరా’లో ఒక ప్రత్యేక పాత్రలో మెరిసింది. ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న ‘ఆచార్య’ సినిమాలోను ఆమె ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనుందనేది తాజా సమాచారం. అయితే ఈ విషయం అధికారికంగా తెలియాల్సి వుంది. ‘ఆచార్య’లో చరణ్ ఒక కీలకమైన పాత్రను చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో ఆయన నక్సలైట్ నాయకుడిగా కనిపించనున్నాడని అంటున్నారు. ఇప్పుడు నిహారిక పేరు కూడా ఈ ప్రాజెక్టులో వినిపిస్తుండటంతో, మెగా అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. నిహారిక చేయడం నిజమే అయితే, ఆమె పాత్ర తీరు తెన్నులు ఎలా వుంటాయనేది ఆసక్తిని రేకెత్తించే అంశమే అవుతుంది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ ఆపేశారు. లాక్ డౌన్ అయిపోగానే మళ్లీ షూటింగ్ మొదలు పెట్టనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -